What is Santhara: శతాబ్దాల కిందటి అతి ప్రాచీన జైన ఆచారం ‘సంతార’. దీన్నే సల్లేఖన దీక్ష, సమాధి మరణం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాచీన ఆచారానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి వియానా బలైంది. ‘సంతార’ అంటే ఆమరణ నిరాహార దీక్ష. అంటే చనిపోయేందుకు సిద్ధమయ్యే వాళ్లే ఈ దీక్ష చేయాలి. సరిగ్గా మాటలు కూడా రాని పాపతో ఇంత కఠినమైన దీక్షను తల్లిదండ్రులు ఎందుకు చేయించారు ? ఎలా చేయించారు ? అనే దానిపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
Also Read :Igla S Missiles: టార్గెట్ పీఓకే.. ‘ఇగ్లా-ఎస్’లను రంగంలోకి దింపుతున్న భారత్
తల్లిదండ్రుల నిర్ణయంపై ఎన్నో ప్రశ్నలు
ఇండోర్‌కు చెందిన పీయూష్, వర్షా జైన్ దంపతుల ఏకైక కుమార్తె వియానా. పీయూష్ ఒక కంపెనీలో టెకీగా పనిచేస్తున్నాడు. వియానాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని 2024 డిసెంబరులో తేలింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కలిసి వియానాకు కనీసం ఆరు నెలలు కూడా వైద్యచికిత్సలు చేయించలేదు. మరోవైపు మూడేళ్ల చిన్నారి వియానా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. ఇలాంటప్పుడు ఆమెకు మరింత మెరుగైన వైద్యం చేయించాలి. తగినంత విరామం ఇవ్వాలి. అంతే తప్ప ఆమరణ నిరాహార దీక్ష ఎలా చేయిస్తారు ? అనే ప్రశ్న అందరి మదిలో ఉదయిస్తోంది. ఈ దీక్ష ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే వియానా ప్రాణాలు కోల్పోయిందని అంటున్నారు. పీయూష్, వర్షా జైన్ దంపతులు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. మార్చి 21న జైన గురువు రాజేష్ ముని మహరాజ్ ఇచ్చిన సలహా మేరకు ఆమెతో సంతారా దీక్ష (ఆమరణ నిరాహార దీక్ష) చేయించారు. మూడేళ్ల వియానా ఈ దీక్ష చేస్తూ, కరిగిపోతుండటాన్ని తల్లిదండ్రులు దగ్గరుండి మరీ చూశారు. అప్పటికే బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాగా క్షీణించిన వియానా, సంతారా దీక్షను ప్రారంభించిన కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వియానాను జైన ఆచారమైన సంతారను పాటించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా గుర్తించింది.
Also Read :Warning : పాకిస్థాన్‌కు మరో వార్నింగ్ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సంతారా దీక్షపై కోర్టులు ఏం చెప్పాయి ?
సంతారా దీక్ష(What is Santhara) చేయడం అనేది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యా యత్నం) కింద శిక్షార్హమని 2015లో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్వచ్ఛందంగా జీవితాన్ని ముగించడం అనేది స్వీయ హాని కలిగించడమేనని, దాన్ని మతపరమైన చర్యగా సమర్థించలేమని కోర్టు పేర్కొంది. అయితే కోర్టు తీర్పుపై జైన సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈనేపథ్యంలో ఒక నెల రోజుల తరువాత ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సంతార ఆచారాన్ని మత స్వేచ్ఛ రక్షణలో కొనసాగించడానికి అనుమతించింది.