Site icon HashtagU Telugu

Mahashivratri : మహాశివరాత్రి అంటే ఏమిటి ?.. దాన్ని ఎందుకు జరుపుకుంటారు?

111

What is Mahashivratri?.. Why is it celebrated?

 

Mahashivratri: “అధ్బుతమైన శివుని రేయి” మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్నీ తెలుసుకుందాం..

ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీరోజూ వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలుకు సూచనగా లేదా విత్తనాలు నాటడం ఇంకా పంటకోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతీ సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు.

మహాశివరాత్రి ప్రాముఖ్యత..

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు.

కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాష పర్వతంతో ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు.

మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

ఇతిహాసాలను పక్కన పెడితే , ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈరోజున మీకు ఏమని నిరూపిస్తున్నారంటే – మీకు జీవంగా తెలిసిన ప్రతీదీ, మీకు తెలిసిన ప్రతీ పదార్థం ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని.

ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. “యోగి” అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను “యోగ” అన్నప్పుడు, దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటంలేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురుంచి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే – అదే యోగ. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది.

read also: LPG Cylinder Price: మ‌హిళ‌ల‌కు ప్రధాని మోదీ గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్ రూ.100 తగ్గింపు..!