Kalma : కల్మా అంటే ఏంటి ? దీనికి టెర్రరిస్టులకు సంబంధం ఏంటి..?

Kalma : పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిపిన దాడి(Pahalgam terrorists)లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేయడం, మిగిలిన వారిని వదిలేయడం హృదయ విదారకంగా మారింది

Published By: HashtagU Telugu Desk
Kalma

Kalma

కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిపిన దాడి(Pahalgam terrorists)లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేయడం, మిగిలిన వారిని వదిలేయడం హృదయ విదారకంగా మారింది. ఐడీ కార్డులు, పేర్లు అడిగి, ఆపై “కల్మా” చదవమని చెప్పి, చదవలేని వారిని హిందువులుగా నిర్ధారించి కాల్చిచంపారు. ఇది ఒక నిర్దాక్షిణ్యమైన మత మూఢత్వానికి, క్రూరతకు పరాకాష్టగా నిలిచింది.

అసలు కల్మా (Kalma ) అంటే ఏంటి..?

కల్మా అంటే ముస్లింలు నమ్మే విశ్వాస ప్రకటన. “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అనే అరబిక్ పదబంధాన్ని కల్మా అంటారు. దీని అర్థం అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ దేవులు లేరు, ముహమ్మద్ ఆయన దూత. ఈ పదాలను ముస్లింలు తమ ప్రార్థనల్లో, దినచర్యలో పలకడం సహజం. కల్మా మొత్తం ఆరు రకాలుగా ఉంటుంది. విశ్వాస ప్రకటన (తయ్యిబా), సాక్ష్యం (షహదహ్), అల్లాహ్ మహిమ (తమ్జీద్), ఏకత్వం (తౌహీద్), క్షమాపణ (ఇస్తిగ్ఫర్), అవిశ్వాస నిరాకరణ (రద్దే కుఫ్ర్) ఇవన్నీ ముస్లిం ఆచారాల్లో ఉన్నత స్థానం పొందినవే.

అయితే ఈ పవిత్ర కల్మాను ఆయుధంగా ఉపయోగించి హింస చెలాయించడం, మతంతో ఖండించదగిన చర్య. ఖురాన్ కానీ, కల్మా కానీ, ఏ ముస్లిం ధర్మోపదేశమూ ఇతరులను చంపమని చెప్పావు. మానవత్వం అనే మాటను నాశనం చేసేలా మతం పేరుతో అమాయకులను హత్యలు చేయడం ఏ మతం చెప్పాడు. కశ్మీర్ ఘటనకు బాధపడాల్సిన ముస్లింలు, హిందువులు కాదు..యావత్ మానవాళి మొత్తం.

  Last Updated: 24 Apr 2025, 08:01 PM IST