బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆలోచన రేకెత్తించే కామెంట్స్ చేశారు. వరకట్న వ్యవస్థను విమర్శిస్తూ..ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఒక యువతిని పెళ్లి చేసుకోవాలంటే వరకట్నం అడగడం ..దాని కంటే దుర్మార్గం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. పాట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నితీష్ కుమార్ మాట్లాడుతూ…మా కాలంలో కళాశాలల్లో అమ్మాయిలు ఉండేవారు కాదు. అది చాలా విచారకరమైన విషయం. ఈరోజు ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. వరకట్నాన్ని రూపుమాపం. వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
వివాహం చేసుకోవాలంటే కట్నం అడగడం…దాని కంటే దుర్మార్గం ఇంకోటి లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు. ఒక మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా…వరకట్నం తీసుకోవడం లేదని డిక్లరేషన్ ఇస్తేనే నేను పెళ్లిలకు హాజరవుతానని ఇది వరకే ప్రకటించానని నితీష్ కుమార్ అన్నారు.