Mohammad Akhtar :ప్రస్తుతమున్న కాలంలో మనుషుల మీద ప్రేమ కన్నా… జంతువుల మీదనే ఎక్కువగా చూపిస్తారు. కొందరు వీటిని తమ సొంత మనషుల్లా చేసుకుంటారు. మరికొందరు ఈ పెంపుడు జంతువులు, సాదు జంతువులపైనా ఆస్తులు కూడా రాస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే కథ కూడా అలాంటిదే. బిహార్ కు చెందిన ఓ వన్యప్రాణి సంరక్షకుడు రెండు ఏనుగుల పేరిట ఏకంగా రూ.5కోట్ల విలువైన ఆస్తి రాశాడు.కొన్నాళ్లకు ఆయన హత్యకు గురయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు కూడా మరణించడంతో రాణి అనే ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది.
బిహార్ లోని జానిపూర్ గా చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ వన్యప్రాణి సంరక్షకుడు.చిన్నప్పటి నుంచి ఆయన రెండు ఏనుగులను పెంచుకున్నాడు.వాటికి మోతి,రాణి అని పేర్లు పెట్టాడు.కుటుంబం కంటే మిన్నగా ఏనుగులను ప్రేమించిన అక్తర్ వాటి సంరక్షణ కోసం ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ అనిమల్ ట్రస్ట్ ను స్థాపించాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు.
ఈ హత్యాయత్నం ఘటన వెనుక తన కుటుంబ సభ్యులే ఉన్నారని అక్తర్ అప్పట్లో ఆరోపించారు.తనను చంపి జంతువుల అక్రమ రవాణా ముఠాకు ఏనుగులను అప్పగించాలనే దురాలోచనతో ఈ పని చేశారని చెప్పారు. 2020లో కొవిడ్ నిబంధనలు
సడలించిన తరువాత అక్తర్ రెండు ఏనుగులను రామ్నగర్ తీసుకొచ్చారు. అక్తర్ మరణం తరువాత ఏనుగుల సంరక్షణ
బాధ్యతలను స్థానిక అటవీ అధికారులు ఇమ్రాన్ఖాన్ అనే వ్యక్తికి అప్పగించారు.