Ration Scam : రేషన్‌ స్కామ్‌లో.. మంత్రి అరెస్ట్

గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ పంపిణీ స్కామ్‌ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు

Published By: HashtagU Telugu Desk
West Bengal Minister Jyotip

West Bengal Minister Jyotip

దేశంలో ప్రతి దాంట్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్ లకు పాల్పడేదెవరో కాదు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులే..ప్రతి రోజు ఎక్కడో ఓ చోట స్కామ్ అనేది వెలుగులోకి వస్తూనే ఉంది. పలు స్కామ్ లలో పలు రాజకీయ నేతలు సైతం జైలు జీవితం గడిపి..బెయిల్ ఫై బయటకు వచ్చిన వారు ఉన్నారు. తాజాగా రేషన్‌ స్కామ్‌ (Ration Scam )లో మంత్రి అరెస్ట్ అయినా ఘటన పశ్చిమ్ బెంగాల్ ( West Bengal) లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్‌ ( Minister Jyotipriya Mallick ) గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ పంపిణీ స్కామ్‌ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే వారిని 20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించారు. ‘నేను కుట్రలో బాధితుడిని’ అని తనను అదుపులోకి తీసుకున్న సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు.

ఇక మల్లిక్‌ అరెస్ట్‌పై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. ఈడీ విచారణలో మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఈ దాడుల వల్ల మంత్రికి ఏమైనా అయితే.. బీజేపీ, దర్యాప్తు సంస్థలపై కేసులు పెడతామని హెచ్చరించారు.

Read Also : Y S Sharmila: దిక్కుతోచని స్థితిలో షర్మిల, YSRTPకి అభ్యర్థులు నిల్!

  Last Updated: 27 Oct 2023, 01:24 PM IST