West Bengal: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్..

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా పార్టీకి ఫార్వార్డ్ చేశారు.

West Bengal: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా పార్టీకి ఫార్వార్డ్ చేశారు. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్‌లకు పంపించినట్లు కౌస్తవ్ బాగ్చీ తెలిపారు.

కౌస్తవ్ బాగ్చీ మాట్లాడుతూ.. బహుశా ఇప్పుడు ప్రజలు నన్ను పార్టీ వ్యతిరేకి అని ముద్ర వేస్తారు. కానీ అవినీతిలో ఉన్న టీఎంసీతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని పదే పదే చెబుతున్నానని బాగ్చి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. అందుకే నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడి పార్టీలో కొనసాగడం ఇష్టం లేదన్నాడు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కౌస్తవ్ బాగ్చీ నిత్యం కామెంట్స్ చేస్తూ వచ్చాడు. రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తన వెంట్రుకలను పెంచబోనని శపథం చేశాడు. ఆయన గత ఏడాది మార్చిలో బెయిల్‌పై విడుదలై దీదీకి వ్యతిరేకంగా తల గుండు చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా కౌస్తవ్ బాగ్చీ బీజేపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తన తదుపరి కార్యాచరణ తెలియాలి అంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందేనని అన్నారు.

Also Read: Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..