Deve Gowda : కాంగ్రెస్ ఓట‌మి ల‌క్ష్యంగా క‌లిసి ప‌నిచేస్తాంః హెచ్‌డీ దేవెగౌడ‌

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 05:35 PM IST

Loksabha Elections 2024 : క‌ర్ణాట‌క‌(Karnataka)లో మొత్తం 28 సీట్ల‌ను బీజేపీ( BJP), జేడీఎస్(JDS) కైవ‌సం చేసుకుంటాయ‌ని మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధ్య‌క్షుడు హెచ్‌డీ దేవెగౌడ(HD Deve Gowda) ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఓట‌మి ల‌క్ష్యంగా తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని అన్నారు. బీజేపీ, జేడీఎస్ స‌మ‌న్వ‌య క‌మిటీ తొలిసారి భేటీ అయింద‌ని, నేత‌లంద‌రూ ఈ స‌మావేశానికి హాజ‌రై క‌ర్ణాట‌క‌ ప్ర‌జ‌ల‌కు సానుకూల సంకేతాలు పంపార‌ని దేవెగౌడ పేర్కొన్నారు.

దేవెగౌడ తొలిసారిగా బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తూ ఎన్డీయేలో చేరార‌ని, ఈ ప‌రిణామంతో క‌ర్నాట‌క ముఖ్యంగా జేడీఎస్‌కు గ‌ట్టిప‌ట్టున్న ద‌క్షిణ క‌ర్నాట‌క‌లో వారి ఓట్లు తమ‌కు లాభిస్తాయ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత శోభా క‌రంద్లాజె విశ్వాసం వ్య‌క్తం చేశారు. క‌ర్నాట‌క‌లో తాము మొత్తం 28 స్ధానాల‌ను గెలుచుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌రోసారి ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టేలా మెరుగైన ఫ‌లితాలు రాబ‌డ‌తామ‌ని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బీజేపీ, జేడీఎస్ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి మాజీ సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప‌, మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవెగౌడ‌, హెచ్‌డీ కుమార‌స్వామి, ఆర్ అశోక‌, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ బీవై విజ‌యేంద్ర స‌హా ఇరు పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు.

Read Also:  Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం