India Population: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లబోసుకున్న చైనా.. జనాభా ముఖ్యం కాదు, నాణ్యత ముఖ్యమని కామెంట్

చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India Population) అవతరించింది. నిజానికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా 142.57 కోట్లు.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 07:37 AM IST

చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India Population) అవతరించింది. నిజానికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా 142.57 కోట్లు. ఈ నివేదిక వెలువడిన తర్వాత చైనా మరోసారి భారత్‌ను కించపరిచే ప్రయత్నం చేసింది. ఇది ఇప్పటికీ 900 మిలియన్ల (90 కోట్ల) మంది నాణ్యమైన శ్రామిక శక్తిని కలిగి ఉందని, ఇది అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందిస్తుందని చైనా తన అక్కసు వెళ్లబోసుకుంది.

నివేదికపై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జనాభా డివిడెండ్ పరిమాణంపై కాకుండా నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అధిక జనాభాతో ప్రయోజనం ప్రజల సంఖ్యపై ఆధారపడి ఉండదు. క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యం. మా దేశంలో 1.4 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య 900 మిలియన్లు అని వ్యాఖ్యానించారు.

Also Read: Most Populous: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా..!

UNFPA స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 డెమోగ్రాఫిక్ డేటా అంచనాల ప్రకారం.. భారతదేశ జనాభాలో 25% మంది 0-14 ఏళ్ల మధ్య ఉన్నవారు, 18% మంది 10-19 ఏళ్ల మధ్య ఉన్నవారు, 26% మంది 10-24 ఏళ్ల మధ్య వయస్సు గలవారు, 68% 15-64 సంవత్సరాల వయస్సులో, 7 శాతం మంది 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారు. నివేదిక ప్రకారం.. చైనా జనాభా 142.57 కోట్లతో పోలిస్తే భారతదేశ జనాభా 142.86 కోట్లు. గణాంకాలను పరిశీలిస్తే 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో, భారతదేశ జనాభా సుమారు మూడు దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంటుందని వివిధ ఏజెన్సీల అంచనాలు సూచించాయి. దీంతో రానున్న రోజుల్లో జనాభా 165 కోట్లు చేరే అవకాశం ఉంది.

జనాభా నిపుణులు మునుపటి UN డేటాను ఉపయోగించి ఈ నెలలో భారతదేశం చైనాను అధిగమిస్తుందని అంచనా వేశారు. ఈ మార్పు ఎంతకాలం ఉంటుందో ఇంకా తెలియదని చెప్పారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి ఐక్యరాజ్యసమితి మరో నివేదికను విడుదల చేసింది. భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందని పేర్కొంది. భారతదేశ జనాభా గణన 2011 సంవత్సరంలో జరిగింది. గత ఏడాది చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా క్షీణించింది. దీని తరువాత చైనా జనాభాలో తగ్గుదల మాత్రమే కనిపిస్తోంది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల 2011 నుండి సగటున 1.2 శాతంగా ఉంది. త 10 సంవత్సరాలలో ఇది 1.7 శాతంగా ఉంది.