ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంగా ప్రకటించింది. ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత అతిశీ (Atishi Marlena) మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పూర్తిగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ,ఇప్పటి వరకు ఎవరితోనూ పొత్తుల గురించి చర్చించలేదని, కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. గోవా, గుజరాత్‌లలో తమ పార్టీ బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని చెప్పారు.
Bhupesh Baghel : మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్
గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరారని ఆమె అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు స్థానాలే మిగిలాయని, అలాంటి పరిస్థితిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అసంభవమని తెలిపారు. తాము అధికారంలోకి రావాలని కాక, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని అతిశీ అన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగినా, వారు ఇప్పటికీ పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పారు.
AP Govt : విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి
ఢిల్లీలో ఆప్ ఓటమిపై కూడా ఆమె స్పందించారు. తమ పార్టీ ఓడిపోతే ప్రజలకు ముప్పే తప్ప తమకు ఏమీ నష్టం లేదని, అధికారంలోకి వచ్చిన బీజేపీ 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేయాలనుకుంటోందని విమర్శించారు. ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ ముందే హెచ్చరించినట్లుగా, ఆప్ ఓడితే విద్యుత్ కోతలు పెరుగుతాయని, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గుతుందని అన్నారు. ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని, రాజకీయ లాభాలు తమకు ముఖ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు.