Mallikarjun Kharge : అన్న‌దాత‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు కాంగ్రెస్ అన్నిర‌కాలుగా బాస‌ట‌

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 04:59 PM IST

 

Farmers Protest : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు (ఎంఎస్‌పీ) చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరుతూ అన్న‌దాత‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు కాంగ్రెస్ అన్నిర‌కాలుగా బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లింకార్జున్ ఖ‌ర్గే(mallikarjun-kharge) బుధ‌వారం స్ప‌ష్టం చేశారు. నిర‌స‌న‌ల‌కు దిగిన రైతుల‌కు కాంగ్రెస్(congress)పార్టీ వెన్నంటి ఉంటంంద‌ని, వారి న్యాయ‌మైన డిమాండ్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని త‌మ పార్టీ కోరుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు.

We’re now on WhatsApp. Click to Join.

రైతుల స‌మ‌స్య‌ల‌ను తాము ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో పొందుప‌రుస్తామ‌ని, ఎంఎస్‌పీ కోసం చ‌ట్టాన్ని తీసుకువ‌స్తామ‌ని ఖ‌ర్గే హామీ ఇచ్చారు. రైతులకు ప్ర‌భుత్వం అందించే ఎంఎస్‌పీని రెట్టింపు చేస్తామ‌ని 2014 ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ హామీ ఊసెత్త‌లేద‌ని అన్నారు. ఎంఎస్‌పీ అమ‌లు చేయాల‌ని రైతులు ఎప్ప‌టినుంచో కోరుతున్నా మోదీ స‌ర్కార్ ప‌ట్టించుకోలేద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ ప‌ట్వారి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

read also : Telangana: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తా: సీఎం రేవంత్

ఇక ఎంఎస్ స్వామినాధ‌న్ నివేదిక సిఫార్సుల‌ను మోదీ ప్ర‌భుత్వం(modi govt) గాలికొదిలేసింద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ అంత‌కుముందు కాషాయ పాల‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. దేశంలో రూ 14 ల‌క్ష‌ల కోట్ల విలువైన బ్యాంకు రుణాల‌ను మాఫీ చేశార‌ని, రూ. 1.8 ల‌క్ష‌ల కోట్ల కార్పొరేట్ రుణాల‌ను మాఫీ చేశార‌ని, కానీ కొద్దిమొత్తంలోనైనా రైతు రుణాల‌ను మాత్రం మాఫీ చేయ‌లేద‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎంఎస్‌పీకి హామీ ఇవ్వ‌డం ద్వారా మ‌న రైతులు బ‌డ్జెట్‌కు భారం కార‌ని, జీడీపీ వృద్ధికి సార‌ధుల‌వుతార‌ని చెప్పారు.