Bachchan Vs Dhankhar : పెద్దల సభలో వాగ్యుద్ధం.. జయా‌బచ్చన్ వర్సెస్ ధన్‌ఖడ్‌‌

Bachchan Vs Dhankhar : రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులను కూర్చోమంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎగతాళి చేశారు.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 09:58 PM IST

Bachchan Vs Dhankhar : రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులను కూర్చోమంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎగతాళి చేశారు. దీంతో పరిస్థితి చేయి దాటింది.  ‘‘ఆందోళన విరమించాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ గానీ..  ఛైర్మన్‌ గానీ చెప్పాలి.. అంతే తప్ప అధికార పార్టీ సభ్యులు వారించడమేంటి ?’’ అని రాజ్యసభ  ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌‌ను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌  నిలదీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వైమానిక రంగంపై విపక్షాలు అడిగిన 18వ ప్రశ్నకు సమాధానం రాక ముందే, రాజ్యసభ స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తర్వాతి ప్రశ్నకు వెళ్లిపోయారు. ఇలా చేయడంపై జయాబచ్చన్‌తో(Bachchan Vs Dhankhar) పాటు కాంగ్రెస్‌ ఎంపీ దీపేంద్రసింగ్‌ హుడా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సరిగ్గా ఇదే టైంలో స్పీకర్ సీటుపైకి వచ్చిన రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌‌ సభ్యులందరినీ తమతమ సీట్లలో కూర్చోవాలని కోరారు. మళ్లీ ఆ ప్రశ్నకు వివరణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయినా కాంగ్రెస్‌ ఎంపీ దీపేంద్రసింగ్‌ హుడా ఆందోళన విరమించలేదు. దీంతో ‘‘మీరు జయా బచ్చన్‌కు అధికార ప్రతినిధి కాదు. ఆమె చాలా సీనియర్‌ సభ్యురాలు. మీరు మద్దతివ్వాల్సిన అవసరం లేదు. 19వ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తరువాత మళ్లీ 18వ ప్రశ్నను పరిగణనలోకి తీసుకుంటాను. ఇది నచ్చకపోతే ఆమె నాపై సీరియస్‌ అవ్వొచ్చు’’ అని కామెంట్ చేశారు. దీనిపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా, అధికార ఎంపీలు కూర్చోమని ఎగతాళి చేశారు. దీంతో సభలో రభసకు దారితీసింది.

We’re now on WhatsApp. Click to Join

అనంతరం సభలో జయాబచ్చన్‌ మాట్లాడుతుండగా రాజ్యసభ  ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌‌ మరోసారి జోక్యం చేసుకున్నారు. ‘‘ మీరు చాలా సీనియర్‌ సభ్యులు. మీరేం మాట్లాడినా దేశ ప్రజలంతా శ్రద్ధగా వింటారు. మమ్మల్ని  సంతోషపెట్టాలి. మీలాంటి గొప్ప నటీమణులు కూడా చాలా రీటేక్‌లు తీసుకునే ఉంటారు కదా. ఇక్కడి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి’’ అని ధన్‌ఖడ్ కామెంట్ చేశారు. ‘‘డిప్యూటీ ఛైర్మన్‌ అనుమతిస్తేనే నేను మాట్లాడాను. ఆయనపై ఎంతో గౌరవం ఉంది’’ అని జయాబచ్చన్‌ చెప్పారు. ‘‘మీరు కానీ.. డిప్యూటీ ఛైర్మన్‌ గానీ.. కూర్చోమని చెబితే కచ్చితంగా పాటిస్తాం. ఎవరో చెబితే చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఏ హక్కుతో అధికార పార్టీ సభ్యులు మమ్మల్ని కూర్చోమని చెబుతున్నారు. ఇప్పుడీ ప్రశ్న వద్దు.. తర్వాత దీనికి సమాధానం చెప్పిస్తామంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఇక్కడెవరూ లేరు. మేం స్కూలు పిల్లలం కాదు కదా. మాక్కూడా కాస్త గౌరవం ఇవ్వండి’’ అని జయాబచ్చన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.  అనంతరం జగదీప్ ధన్‌ఖడ్ 18వ ప్రశ్నను మళ్లీ లిస్టు చేశారు.

Also Read : Gadala The Leader : నా మార్గం.. నా ఇష్టం.. ప్రజల కోసమే పాలిటిక్స్ : గడల