Lone Survivor Struggle: నా కుమారుడు త్వ‌ర‌గా కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నా – గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ తండ్రి

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో బ‌య‌ట ప‌డిన ఏకైక వ్య‌క్తి గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ బెంగుళూరులోని కమాండ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Written By:
  • Updated On - December 10, 2021 / 11:10 AM IST

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో బ‌య‌ట ప‌డిన ఏకైక వ్య‌క్తి గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ బెంగుళూరులోని కమాండ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది మ‌ర‌ణించ‌గా…గాయాల‌తో గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ బ‌య‌ట‌ప‌డ్డారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌న కుమారుడు త్వ‌ర‌గా కోలుకుంటాడ‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తండ్రి రిటైర్డ్ క‌ల్న‌ల్ కేపీ సింగ్ తెలిపారు. బెంగుళూరు క‌మాండ్ ఆసుప‌త్రిలో సౌక‌ర్యాలు బాగానే ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే వెల్లింగ్ట‌న్ ఆసుప‌త్రిలో వ‌రుణ్ సింగ్ ని చేర్చ‌గా మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు క‌మాండ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Also Read : హెలికాప్టర్ కూలే ముందు ఏం జరిగిందంటే- ప్రత్యక్ష సాక్షులు

భోపాల్‌లో నివసిస్తున్న కల్నల్ కేపీ సింగ్… సంఘటనకు కొన్ని రోజుల ముందు తన కుమారుడు తనకు ఫోన్ చేశాడని తెలిపారు. అప్ప‌టికీ వెల్లింగ్ట‌న్ లోని డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి సీడీఎస్ తో వెళ్లే కార్య‌క్ర‌మం అప్ప‌టికి నిర్ణ‌యించ‌లేద‌ని ఆయ‌న తెలిపారు.ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న త‌మ కుటుంబ స‌భ్యులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని…వ‌రుణ్ సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని ఆయ‌న మేన‌మామ అఖిలేష్ సింగ్ తెలిపారు. వ‌రుణ్ సింగ్ త‌న మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నేష‌నల్ డిఫ‌న్స్ అకాడ‌మీ లో అర్హ‌త సాధించ‌డాని తెలిపారు.

Also Read : హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వీవీఐపీలు

వ‌రుణ్ సింగ్ కుటుంబంలో అంద‌రు డిఫెన్స్ లో ప‌ని చేసేవారే. వ‌రణ్ సింగ్ సోద‌రుడు ఇండియ‌న్ నేవీలో ప‌ని చేస్తున్నాడు. తండ్రి కేపీ సింగ్ క‌ల్న‌ల్ గా ప‌ని చేశారు. వ‌రుణ్ సింగ్‌ ఇటీవలే గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు .వ‌రుణ్‌ సింగ్ కి భార్య,ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.అక్టోబర్ 12, 2020న వైమానిక అత్యవసర సమయంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్‌ను రక్షించినందుకు వరుణ్‌కి ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు శౌర్య చక్ర అవార్డు లభించింది. వింగ్ కమాండర్‌గా ఉన్న వరుణ్ సింగ్ LCA క్రాష్ నుండి కాపాడాడు