Watch : గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో స‌త్తాచూపిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన 73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స‌త్తా చూపించింది.

  • Written By:
  • Publish Date - January 26, 2022 / 04:22 PM IST

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన 73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స‌త్తా చూపించింది. 75 ఎయిర్ క్రాఫ్ట్ ల విన్యాసాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. గ‌గ‌న‌త‌లంలో చేసిన విన్యాసాల‌ను మొట్ట‌మొద‌టిసారిగా ఎయిర్‌క్రాప్ట్‌ల నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేసిన ఘ‌న‌త ద‌క్కించుకుంది దూర‌ద‌ర్శ‌న్‌.

రాఫెల్ యుద్ద విమానాలు, జాగ్వ‌ర్‌లు, ఎంఐజీ 29 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రెండు Su-30 MIలు క‌లిసి చేసి బాజ్ ఫార్మేష‌న్ విన్యాసాల్లో హైలైట్‌గా నిలిచింది.

రెండు ధృవ్‌, రుద్ర హెలికాఫ్ట‌ర్ల‌తో మ‌రో విన్యాసాన్ని గ‌గ‌న‌త‌లంలో ప్ర‌ద‌ర్శించింది ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌.