Site icon HashtagU Telugu

UP Polls : సీఎం అభ్యరి పై ప్రియాంక యూటర్న్

Priyankagandhi

Priyankagandhi

యూపీ కాంగ్రెస్ సిఎం అభ్యర్ధి గా తన మొఖాన్ని చూడమని చెప్పిన 24 గంటల్లో ప్రియాంక గాంధీ యూ టర్న్ తీసుకుంది. అసహనం కారణంగా అలా అన్నాను అని నాలుక తిప్పింది. పదే పదే మీరు అడుగుతున్నారు అందుకే ఇర్రెటేషన్లో అలా చెప్పాను అంటూ సిఎం అభ్యర్థి ఫోకస్ నుంచి తప్పుకుంది.వాస్తవంగా యూత్ మేనిఫెస్టో ను విడుదల సందర్భంగా శుక్రవారం ఆమె ను ప్రశ్నించిన మీడియాకు సిఎం అభ్యర్థిగా నా మొఖం వైపు చూడాలి అని చెప్పింది. దీంతో ఆ న్యూస్ హైలైట్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రియాంక స్టేట్మెంట్ తో అప్రమత్తం అయింది. నష్టాన్ని పూడ్చే క్రమంలో మళ్ళీ ప్రియాంక శనివారం మీడియా ముందుకు వచ్చి అంతా తూచ్ అంటూ సీఎం అభ్యర్థి మాటలను కొట్టివేసింది.ఈసారి మాయావతి, యోగిని టార్గెట్ చేస్తూ ప్రియాంక విరుచుకు పడింది. యోగి చెబుతున్న విధంగా యూపీలో 80% అండ్ 20% వర్గాల మధ్య పోరు కాదని ఆమె అన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ పెంచి పోషిస్తున్న 1% వ్యాపార,కార్పొరేట్లకు, 99%సామాన్యులకు మధ్య జరుగుతున్న పోరు అని యోగికి చురకలు వేశారు. ఇక మాయావతి ఎందుకు మౌనంగా ఉన్నారో..చెప్పాలని ప్రియాంక నిలతీసింది.

 

Exit mobile version