Site icon HashtagU Telugu

Lok Sabha : రేపు లోక్‌సభ ముందుకు రానున్న ‘వక్ఫ్ బోర్డు’ చట్ట సవరణ బిల్లు..

'Waqf Board' Act Amendment Bill to come before Lok Sabha tomorrow

'Waqf Board' Act Amendment Bill to come before Lok Sabha tomorrow

Waqf Board Bill : రేపు (గురువారం) లోక్‌సభ ముందు వక్ఫ్ బోర్డు (waqf board) చట్ట సవరణ బిల్లును తీసుకురానుంది. వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ చెక్ పెట్టెందుకు మిగతా ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం వహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతోంది. ఈ మేరకు వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెడతారు. సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెట్టబడుతోంది. అయితే, ఈ బిల్లును పలువురు ముస్లిం ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ చట్టాన్ని కీకృత వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 1995గా పేరు మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ చట్టాన్ని లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించపచేయడం ప్రభుత్వం ప్రాధాన్యతగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జాయింట్ కమిటీ చర్చ కోసం పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత రెండు నెలల్లో ఈ బిల్లుపై దాదాపుగా 70 గ్రూపులతో సంప్రదింపులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్రమ ఆక్రమణల నుంచి వక్ఫ్ ఆస్తుల్ని విముక్తి చేడయమే కాకుండా పేద ముస్లింలు, ముస్లిం మహిళకు న్యాయం చేయడమే ఈ బిల్లు ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ చట్టం ప్రకారం, వక్ఫ్ అనేది మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తిని సూచిస్తుంది.

దేశంలో 30 వక్ఫ్ బోర్డులు 8 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఆస్తులను నియంత్రిస్తున్నాయి. దేశంలో రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత అత్యధిక భూములు కలిగిన సంస్థగా వక్ఫ్ ఉంది. మరోవైపు కేంద్రం, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణనను కూడా బిల్లు తీసుకురాబోతోంది. అంతేకాకుండా ప్రతిపాదిత బిల్లు ప్రకారం వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తి లేదా ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ నిర్ణయించేలా బిల్లులో సవరణలు ప్రతిపాదిస్తున్నారు. ముస్లింలో ఇతర కమ్యూనిటీలైన బోహరాలు, అఘాఖానీల కోసం ప్రత్యేక ఔకాఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ముసాయిదా చట్టంలో షియాలు, సున్నీలు, బోహ్రాలు, అగాఖానీలు మరియు ముస్లిం వర్గాలలో ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించారు.

Read Also: Russia Aircraft Crash: రష్యాలో విమానం కూలి ఇద్దరు మృతి