కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వక్ఫ్ (Waqf Amendment Bill) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన ఈ బిల్లు.. 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషంగా మారింది. అర్థరాత్రి దాటేవరకు జరిగిన విస్తృత చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ ఇది ముస్లిం మైనారిటీలకు నష్టం కలిగించదని స్పష్టంగా ప్రకటించారు.
Bulk Drug Manufacturers: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. 7,500 మందికి ఉద్యోగాలు!
ఈ బిల్లు (Waqf Amendment Bill)మత సంబంధిత విషయమని కాకుండా ఆస్తుల నిర్వహణ, అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చినదని ప్రభుత్వం తెలిపింది. వక్ఫ్ బోర్డు నిర్వహణ , సృష్టి, లబ్ధిదారులు ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరమవుతుందని ఈ సవరణ ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అమిత్ షా లుటియెన్స్ జోన్, పురాతన ఆలయాలు, పాత పార్లమెంట్ భవనం వంటి వక్ఫ్ లేబుల్ కలిగిన ఆస్తుల జాబితాను ప్రకటించారు.
First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?
లోక్‌సభలో ఈ బిల్లు (Waqf Amendment Bill) 282 మంది సభ్యుల మద్దతుతో ఆమోదం పొందగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. 12 గంటల పాటు సాగిన ఈ చర్చ అనంతరం అర్థరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం 1995లో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవరించి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.