Site icon HashtagU Telugu

Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ తూచ్.. గెలిచేది మేమే : సోనియాగాంధీ

Congress Rajya Sabha Candidates

Sonia Sonia Gandhi Key Meet

Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కొట్టిపారేశారు. ‘‘ఒక్కరోజు ఆగి.. ఎన్నికల ఫలితాలను చూడండి.. మీకే తెలుస్తుంది’’ అని ఆమె సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విపక్ష ఇండియా కూటమికి మెరుగైన ఫలితాలు వస్తాయని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయని సోనియా గాంధీ(Sonia Gandhi) స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయని ఆమె చెప్పారు. తప్పకుండా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

Also Read :Nitheesha Kandula : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సోనియా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డీఎంకే కార్యాలయానికి వెళ్లి కరుణానిధికి నివాళులర్పించారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సోనియాగాంధీ బదులిస్తూ.. ఇండియా కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. డీఎంకే ఆఫీసుకు వెళ్లి కరుణానిధికి నివాళులు అర్పించిన వారిలో సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన రామ్‌గోపాల్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Also Read : Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.  ఈనేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. సెన్సెక్స్ 2 వేలకుపైగా, నిఫ్టీ 600 పాయింట్లకుపైగా పెరిగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 2130 పాయింట్లు పెరిగి 76 వేల 100 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 650 పాయింట్ల లాభంతో 23 వేల 200 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ప్రధాన 13 సెక్టార్ల సూచీలు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉండగా.. అన్నీ దాదాపు 4 నుంచి 5 శాతం వరకు పుంజుకున్నాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ తక్కువ లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ వంటివి 10 శాతం వరకు పుంజుకున్నాయి.