అదేంటి ఎన్నికల షెడ్యూల్ కు నూతన వధూవరులకు సంబందం ఏంటి అనుకుంటున్నారా..? సంబంధం ఉంది..ఒకరిద్దరు కాదు దాదాపు 50 వేలకు పైగా నూతన వధూవరులు..ఎన్నికల షెడ్యూల్ తేదీతో తలపట్టుకుంటున్నారు. పెళ్లి (Marriage) అనేది జీవితంలో ఒక్కసారే జరిగేది. మూడు ముళ్ల బంధంతో నూరేళ్లు కలిసి ఉండే జీవితం. అలాంటి వివాహ వేడుకను అందర్నీ ముందు..అందరి దీవెనలతో చేసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. తాజాగా అలాగే భవిస్తూ..వివాహ వేడుకకు ముహూర్తం పెట్టారు. కానీ ఇప్పుడు అదే ముహూర్తాన ఎన్నికల పోలింగ్ జరుగుతుండడం తో నూతన వధూవరుల అయ్యో అంటూ తలపట్టుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఎన్నికల కమిషన్ తెలంగాణతో పాటు మరో నాల్గు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లో నవంబర్ 30 న , మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్ లో నవంబర్ 07 , 17 న , మిజోరం లో నవంబర్ 07 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 60 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాగా రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23 (November 23) వ తేదీన జరగనుంది. అయితే అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి (Dev Uthani Ekadashi) కావడం గమనార్హం. నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్ వ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్, ఎన్నికల కోడ్ ఆంక్షలతో పెళ్లిళ్లు చేసుకునేవారితోపాటు వాటికి హాజరయ్యేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవ్ ఉథాని ఏకాదశి వివాహాలకు అత్యంత అనువైన రోజు అని.. అందుకే ఆ రోజు పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.అలాంటి రోజునే పోలింగ్ రావడం తో నూతన వధూవరులు తలపట్టుకుంటున్నారు.
Read Also : Mukesh Ambani: భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ముఖేష్ అంబానీ.. మొత్తం సంపద ఎంతంటే..?