WHO Warns: సునామీలా విస్తరిస్తున్న వైరస్.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 02:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ సంఖ్యను మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ లను కొన్ని దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని… ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోందని, ఇలాంటి పరిణామాలు మంచివి కావని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండేలా ఈ క్షణం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు గుంపులుగా గుమికూడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని అథనం పిలుపునిచ్చారు.

కాగా తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్ట‌ర్ గ‌డ‌ల‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి క‌రోనా కేసుల గురించి మాట్లాడారు. క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇది కరోనా థర్డ్‌ వేవ్‌ను సంకేత‌మ‌ని చెప్పారు. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాని చెప్పారు. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని తెలిపారు.

https://mobile.twitter.com/WHO/status/1476215619225796612