Site icon HashtagU Telugu

Viral Video: ముందు మూడు సింహాలు.. వెనక భయం లేకుండా మహిళ!

Woman Take Walk With Three Lions Video Stuns Internet

Woman Take Walk With Three Lions Video Stuns Internet

సింహం.. ఈ పేరు వింటేనే మనకు హడల్ పుడుతుంది. ఆకారంలో భారీగా ఉండే సింహాన్ని ఎవరు చూసినా అలా ప్రాణాలు చేతిలో పట్టుకోవాల్సిందే. అడవికే రారాజుగా పేరున్న సింహాన్ని దూరంగా చూస్తేనే గుండె జారిపోతుంది. అలాంటి సింహాన్ని దగ్గరి నుండి చూస్తే.. ఇక అంతే సంగతులు. కానీ ఓ మహిళ మాత్రం ఎవరూ ఊహించని పని చేసింది.

ఒక సింహం ఉంటే మనకు దడ పుడితే ఓ మహిళ ఏకంగా మూడు సింహాలతో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మూడు సింహాలు ముందు అలా నడుచుకుంటూ వెళుతుంటే ఓ మహిళ ఎంతో గర్జాగా, భయం అనేదే లేకుండా నడుచుకుంటూ వాటి వెంట అడుగులు వేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.

కంటెంట్ క్రియేటర్ జెన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సింహాలు జూలు విదిల్చి నెమ్మదిగా నడుస్తుంటే.. వాటి వెంట ఎంతో ధైర్యంగా, ఏమాత్రం బెంకు లేకుండా ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లిన విజువల్స్ వీడియోలో కనిపించాయి.

వీడియో చూడటానికై ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ముందు వెళుతున్నది సింహాలు అనుకున్నారా? లేదంటే కుక్కలునుకున్నారా? అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే ఆ సింహాలకు ఆమె ఎంతో స్పెషల్ కాబట్టే అవి ఏమీ చేయడం లేదు అని కామెంట్లు పెడుతున్నారు.

ఎంతైనా అవి కృూరమృగాలు కాబట్టి వాటి విషయంలో ఏమరపాటుగా ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించకతప్పదు అని మరికొందరు ఆమెకు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా ముందు సింహాలు నడుస్తుంటే.. వెనక మహిళ నడుస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.