Site icon HashtagU Telugu

Viral : నడి రోడ్ ఫై అందరు చూస్తుండగా..బైక్ ఫై ముద్దులతో రెచ్చిపోయిన జంట

Jaipur couple seen kissing on moving bike

Jaipur couple seen kissing on moving bike

ఇటీవల కాలంలో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్ గా రొమాన్స్ (Lovers Romance)లో మునిగిపోతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. చుట్టూ ప్రజలు ఉన్నారా..లేదా..? మనం ఎక్కడ ఉన్నాం..?ఏంచేస్తున్నాం..? అనేది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ యువ జంట ముద్దులతో రెచ్చిపోయిన ఘటన వైరల్ గా మారగా..తాజాగా మరో జంట బైక్ ఫై వెళ్తూ ముద్దులతో (Jaipur couple seen kissing) రెచ్చిపోయారు. ఈ ఘటనను కొంతమంది తమ ఫోన్లతో షూట్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది.

Read Also : Tirumala Brahmothsavalu : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. తిరుమలకు ముఖ్యమంత్రి.. పట్టు వస్త్రాలు సమర్పణ..

ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఓ యువ జంట బైక్ ఫై ప్రయాణం చేస్తూ..ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌పై వెళుతుండగా అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది.. జైపూర్‌లోని దుర్గాపుర ప్రాంతంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. వీడియో వైరల్ అయిన వెంటనే, పోలీసులు యువకులను గుర్తించి పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఉంటె..బైక్ అపి..పక్కకు పోయి ముద్దులు పెట్టుకోవచ్చు కదా..ఆలా బైక్ ఫై ప్రయాణం చేస్తూ ముద్దులు పెట్టుకోవడం అవసరమా..? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వారి ప్రాణాలు పోవడమే కాదు పక్కవారి ప్రాణాలు కూడా పోతాయి కదా..? ఆమాత్రం తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.