Vinesh Phogat filed the nomination: హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ ఈరోజు నామినేషన్.. దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోంది. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు పాల్గొన్నారు.
Read Also: AAP : 21 మంది అభ్యర్థులతో ఆప్ నాలుగో జాబితా విడుదల
నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడిన దీపేందర్ హుడా, ఫోగట్ పార్టీకి “పెద్ద విజయం” సాధిస్తారని, జులనాలోనే కాకుండా హర్యానా అసెంబ్లీలో భూపిందర్ సింగ్ హుడా నాయకత్వంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హుడా సాహబ్ నాయకత్వంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
కాగా, గత ఐదు రోజు క్రితం బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వినేశ్‌కు వ్యతిరేకంగా.. బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీపడనున్నారు. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.