2 Crores And SUV Car: ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి రూ. 2 కోట్లు, ఎస్‌యూవీ కారు కూడా..!

ఎన్నికలు వస్తే అన్నీ మరిచిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు.

Published By: HashtagU Telugu Desk
Cropped

Cropped

ఎన్నికలు వస్తే అన్నీ మరిచిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా గెలుపే లక్ష్యం. కానీ.. ఓ చోట ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి రూ.2 కోట్లు, ఎస్‌యూవీ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ ఘటన హర్యానాలోని రోహతక్ జిల్లా చిడీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్తులు పూలమాలలు, కరెన్సీ నోట్లతో ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్తులు రూ.2 కోట్ల 11 లక్షల నగదు, ఎస్‌యూవీ కారును కూడా అందజేశారు. అదే సమయంలో పంచాయితీ కూడా ఈ అభ్యర్థిని గౌరవించాలని నిర్ణయించుకుంది. అతనికి ముఖ్యమైన పదవిని ఇవ్వాలని ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా కిలోయ్ నియోజకవర్గంలోని రోహతక్ జిల్లాలో చిడీ గ్రామం మొదటి గ్రామం. ఇక్కడ సర్పంచ్ పదవికి ధర్మపాల్ అనే వ్యక్తి పోటీ చేశారు. నవంబర్ 12న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో నవీన్ దలాల్ చేతిలో 66 ఓట్ల తేడాతో ధర్మపాల్ ఓడిపోయాడు.

అయితే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినా గ్రామస్తులు డప్పు కొట్టి అభ్యర్థిని ఘనంగా సత్కరించారు. గ్రామస్తులంతా కలిసి డబ్బులు సేకరించి అతనికి రూ.2 కోట్ల 11 లక్షల నగదు, కారును బహుమతిగా ఇచ్చారు. గ్రామంలో సోదరభావాన్ని కొనసాగించేందుకే ఈ సన్మానం జరిగిందని, అభ్యర్థిని నిలదీయడానికి కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ధర్మపాల్ మాట్లాడుతూ.. గ్రామస్తుల ఈ సన్మానం చూసి నేను ఓడిపోలేదు.. గెలిచాను. గెలిచిన అభ్యర్థిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. గ్రామస్తుల నుండి ఈ గౌరవం చూసి చాలా సంతోషించాను అని కూడా అన్నారు.

 

 

 

  Last Updated: 19 Nov 2022, 07:12 PM IST