Site icon HashtagU Telugu

Toyota Chairperson: గుండెపోటుతో టయోటా కిర్లోస్కర్ వైస్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మృతి..!!

Vikram

Vikram

టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 64ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అర్థరాత్రి చాతీలో మంటలు వస్తున్నాయనడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఆయనకు బ్రెయిన్ డెట్ అయినట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే గుండెపోటుతో మరణించినట్లు ద్రువీకరించారు. విక్రమ్ కిర్లోస్కర్ మరణంపట్లు ప్రముఖులు సంతాపం తెలిపారు.

విక్రమ్ కిర్లోస్కర్ ఈ మధ్య ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమను ప్రపంచ వ్యాప్తంగా మరింత పోటీగా మార్చేందుకు ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు పెద్దెత్తున ఉపాథి కల్పించే విధంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పారు. 1888లో లక్ష్మణరావు కిర్లోస్కర్ స్థాపించిన సమూహంలో విక్రమ్ కిర్లోస్కర్ నాలుగవ తరానికి చెందిన వాడు. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ట్రైనీగా పూణేలోని కిర్లోస్కర్ కమిన్స్ లో చేరారు. విక్రమ్ కిర్లోస్కర్ విద్యాభ్యాసం విదేశాల్లో సాగింది. మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానిక్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు ఆయన. 1997లో జపాన్ కు చెందిన టయోటా మోటార్ కార్ప్ ను ఇండియాకు తీసుకురావడంతో విక్రమ్ కిర్లోస్కర్ ప్రముఖ పాత్ర పోషించారు.