Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?

బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Siddharth Mallya

Siddharth Mallya

Siddharth Mallya: బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు. అతడి కొడుకు సిద్ధార్థ్ మాల్యా  ఇండియాలోనే ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. తండ్రి విజయ్ మాల్యా దొంగలా ఎక్కడో లండన్‌లో తలదాచుకున్న ప్రస్తుత తరుణంలో..  సిద్ధార్థ్ మాల్యా ఎవరిని పెళ్లాడబోతున్నాడు ? ఆ వధువు ఎవరు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఎవరీ జాస్మిన్ ?

సిద్ధార్థ్ మాల్యా(Siddharth Mallya) పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు జాస్మిన్. ఈ వారంలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతోంది. ఈ మ్యారేజ్‌కు అతికొద్ది మంది సన్నిహితులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం హాలోవీన్‌ వేడుక సందర్భంగా జాస్మిన్‌కు సిద్ధార్థ్ మాల్యా రింగ్‌ తొడిగాడు.  ఆమెకు తన లవ్‌ను ప్రపోజ్‌ చేశాడు. తాజాగా ఈ ఇద్దరూ ఫొటో షూట్‌ ద్వారా తమకు పెళ్లి జరగబోతోందనే విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి వీళ్లిద్దరూ చాలా ఏళ్లుగా స్నేహం కొనసాగిస్తున్నారు. జాస్మిన్‌ ఇన్‌స్టా బయోలో.. ఆమె అమెరికా వాస్తవ్యురాలు అని రాసి ఉంది. ప్రొఫైల్‌ను బట్టి  జాస్మిన్ ఒకప్పుడు మోడల్‌గా పనిచేసేది. ఆమె కుటుంబ నేపథ్యం గురించి ఇంకా ఎవరికీ తెలియదు. ఇక సిద్ధార్థ్‌ కూడా మోడలే. అతడు కొన్ని సినిమాల్లో నటించాడు కూడా.

Also Read :YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?

అమెరికాలో పుట్టాడు.. లండన్‌లో పెరిగాడు

  • విజయ్‌ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సిద్ధార్థ్‌  జన్మించాడు.
  • సిద్ధార్థ్ లండన్‌, యూఏఈ దేశాల్లో పెరిగాడు.
  • లండన్‌ రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామా నుంచి అతడు డిగ్రీ పూర్తి చేశాడు.
  • ఆ తర్వాత  డిగ్రీ పుచ్చుకుని మోడలింగ్‌ చేయడం మొదలుపెట్టాడు.
  • కింగ్‌ఫిషర్‌ మోడల్స్‌ జడ్జిగా పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్‌ టాపిక్‌ అయ్యాడు.
  • ఐపీఎల్‌ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
  • యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశంపై సిద్దార్థ్ రెండు పుస్తకాలు రాశాడు.

Also Read :Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..

  • సిద్ధార్థ్‌ తండ్రి విజయ్‌ మాల్యా రూ.9వేల కోట్ల బ్యాంకుల అప్పులు ఎగవేసి పరారైన తర్వాత ఫ్రాన్స్‌లో రూ.313 కోట్లతో స్థిరాస్తి కొన్నాడు.
  • భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం రూ.14 కోట్లు విలువైన మాల్యా ఆస్తులను సీజ్‌ చేసింది.
  Last Updated: 18 Jun 2024, 08:35 AM IST