Site icon HashtagU Telugu

Vijay Mallya : విజయ్ మాల్యాకు 4నెలల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు..!!

Vijay Mallya

Vijay Mallya

లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు 4నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ అయ్యింది. అయితే మాల్యా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. 2016 నుంచి మాల్యా లండన్ లో తలదాచుకుంటున్నారు. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినందుకు మాల్యాకు 4నెలల జైలు శిక్షతోపాటు 2వేల రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం…అందుకు తగిన శిక్ష అవసరమని భావించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాల్యా తన కుటుంబం పిల్లలకు లోగడ 40మిలియన్ డాలర్లు పంపించాడు. వాటిని కోర్టుకు తిరిగి బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

కాగా మాల్యా పర్సనల్ గా లేదా లాయర్ ద్వారా విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశాన్ని ఇచ్చినట్లు గుర్తు చేసింది. 9వేల కోట్ల రుణాలు చెల్లించడంలో మాల్యా విఫలం కావడంతో SBIఆధ్వర్యంలో బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన ఆస్తులను మాల్యా వెల్లడించలేదని..వాటిని తన పిల్లల పేరిట బదిలీ చేసుకుని నిబంధనలను తుంగలో తొక్కినట్లు విచారణలో గుర్తించారు.