Videocon CEO Arrested: క్విడ్ ప్రోకో ట్విస్ట్.. వీడియోకాన్ సీఈవో అరెస్ట్!

చందాకొచ్చార్ అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మరో బిగ్ షాట్ ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది.

  • Written By:
  • Updated On - December 26, 2022 / 12:40 PM IST

ఐసిఐసిఐ లోను (రుణం) కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ (Videocon CEO) వేణుగోపాల్ ధూత్‌ను CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోమవారం అరెస్టు చేసింది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌కి నాయకత్వం వహిస్తున్న వీడియోకాన్ గ్రూప్‌కు అందించిన ₹ 3,000 కోట్లకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ (ICICI) బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సిబిఐ (CBI) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ వేణుగోపాల్ ధూత్ అరెస్ట్ అయ్యాడు.

లోన్ ఫ్రాడ్ కేసులో ఐపిసి సెక్షన్ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దీపక్ కొచ్చర్, వీడియోకాన్ (Videocon CEO) ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) కంపెనీలతో పాటు కొచర్స్, ధూత్‌లను సిబిఐ నిందితులుగా పేర్కొంది. 59 ఏళ్ల చందా కొచ్చర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ అయిన వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్‌గా 2018 అక్టోబర్‌లో వైదొలిగారు.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘిస్తూ ధూత్ (Videocon CEO) ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ ₹ 3,250 కోట్ల మేరకు క్రెడిట్ సౌకర్యాలను మంజూరు చేసిందని సిబిఐ ఆరోపించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ధూత్ సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (SEPL) ద్వారా నూపవర్ రెన్యూవబుల్స్‌లో ₹ 64 కోట్ల పెట్టుబడి పెట్టారని, SEPLని దీపక్ కొచ్చర్ నిర్వహించే పినాకిల్ ఎనర్జీ ట్రస్ట్‌కు మధ్య సర్క్యూట్ మార్గంలో బదిలీ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ గ్రూప్ చైర్మన్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

Also Read: Marriages: మద్యానికి బానిసైన వ్యక్తికి పెళ్లి చేయొద్దు!