ముంబై (Mumbai) లో లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే. నిత్యం ఇక్కడ లోకల్ రైళ్లు (Local trains) రద్దీగా ఉంటాయి. ఈ రైళ్ల ద్వారా రోజులో లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ముంబై లోకల్ రైళ్లకు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రయాణికుల రైలు వ్యవస్థల్లో ఒకటిగా పేరుంది. నిత్యం ఈ రైళ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించడం సర్వసాధారణమే. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇంత ప్రమాదకరమైన ప్రయాణమా.. అంటూ ఆశ్చర్య పోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో.. రైలు వేగంగా వెళ్తుంది. పుట్ బోర్డులో అమ్మాయిలు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒక బామ్మకూడా ఉంది. ఆమె లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో పైన కడ్డీని పట్టుకొని పుట్ బోర్డుపైనే నిలుచొని ప్రయాణిస్తుంది. వీరంతా ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా వీరి ప్రాణంపోవటం ఖాయం. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంత ప్రమాదకరమైన ప్రయాణం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఒక వైపు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు సాధారణ రైళ్లలో ఇదీ దుస్థితి అంటూ విమర్శలతో కామెంట్లు చేస్తున్నారు. దేశంలో మొదటి రైలు ప్రారంభమై 160ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ రైళ్లలో ప్రయాణికుల అవస్థలు ఇవి అంటూ ప్రభుత్వాల తీరుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేశారు.
Condition of #Mumbai after almost 160 years of first train was started..
Government is focusing on #VandeBharat not on improvising situation of #Mumbai local services. pic.twitter.com/CJiTxF0tjm— Sonu Kanojia (@NNsonukanojia) June 12, 2023
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. సింధియా సన్నిహితుడు జంప్..