Site icon HashtagU Telugu

Street Dogs : జంతు ప్రేమికుల గెలుపు..వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ

Victory for animal lovers.. Amendment to Supreme Court orders on street dogs

Victory for animal lovers.. Amendment to Supreme Court orders on street dogs

Street Dogs : దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తుదకు తెరపడింది. జంతు ప్రేమికులు కలలుగన్న విధంగా, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టతను కలిగించడమే కాకుండా, మూగజీవాల హక్కులను కూడా పరిరక్షించేలా ఉన్నాయనిపిస్తుంది. ఇటీవలి రోజుల్లో వీధి కుక్కల వ్యవహారంపై తీవ్ర చర్చలు చోటు చేసుకున్నాయి. కొన్ని నగరాల్లో వీధి కుక్కల బారి నుంచి ప్రజల రక్షణ పేరుతో చేపట్టిన చర్యలు, జంతు హక్కుల కార్యకర్తల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కూడా కొన్ని విషయంలో సందిగ్ధత కలిగించాయి. ఈ నేపథ్యంలో, ఆగస్టు 8న విడుదలైన న్యాయస్థాన ఆదేశాలపై వివిధ వర్గాల నుంచి గట్టి విమర్శలు వచ్చాయి.

Read Also: Funny Complaint : లడ్డూ కోసం సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్.. మధ్యప్రదేశ్‌లో వింత సంఘటన

ఈ సవరణల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత, వాటికి అవసరమైన టీకాలు ఇవ్వాలని, డీవార్మింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొంది. టీకాల కార్యక్రమం పూర్తయిన అనంతరం, కుక్కలను తిరిగి అదే ప్రాంతానికి తీసుకెళ్లి వదలాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది వాటి సహజ వాతావరణం భద్రంగా ఉండేలా చూసే చర్యగా భావించవచ్చు. అయితే ఈ మార్గదర్శకాలు అన్ని కుక్కలపైనా వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. రేబిస్ వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్న, లేదా ప్రజలపై తీవ్ర దూకుడుగా ప్రవర్తించే కుక్కలను ప్రత్యేకంగా గుర్తించి వేరు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ తరహా కుక్కలకు కూడా అవసరమైన రోగనిరోధక టీకాలు వేయాలని, కానీ వాటిని తిరిగి జనావాసాల్లో వదలకూడదని తేల్చిచెప్పింది.

అదనంగా, ఇటువంటి ప్రమాదకర కుక్కలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంచి సంరక్షించాలని సూచించింది. ఈ విధంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే, మూగజీవాల సంక్షేమాన్ని కూడా సమతుల్యం చేయాలనే కోణాన్ని ఈ మార్గదర్శకాల్లో గమనించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తాజా మార్గదర్శకాలు న్యాయసమ్మతంగా మాత్రమే కాకుండా, మానవత్వపూరితంగా కూడా ఉన్నాయి. వీధి కుక్కలపై సమర్థవంతమైన నియంత్రణతో పాటు, వాటిపై క్రూరత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా ఈ ఆదేశాలు ప్రయోజనకరమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నూతన మార్గదర్శకాలు అమలులోకి వస్తే, ప్రజల భద్రత కాపాడబడే అవకాశం ఉండడంతోపాటు, మూగజీవాలకు కూడా అన్యాయం జరగకుండా చూసే అవకాశం కలుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా వీధి కుక్కల వ్యవహారం మరింత సమగ్రంగా, సమతుల్యతతో పరిష్కార మార్గంలోకి వచ్చే అవకాశముంది.

కాగా, ధర్మాసనం ఈరోజు ఇచ్చిన తీర్పులో..

. వీధి కుక్కలన్నింటిని షెల్టర్‌లలో ఉంచాల్సిన అవసరం లేదు.
. కరిచే కుక్కలు, ఆక్రోశంతో ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్‌లలో ఉంచాలి.
. బయటకు వదిలే ముందు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజ్‌ తప్పక చేయాలి.
.వీధుల్లో కుక్కలకు ప్రజలు ఆహారం పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు.
. ప్రతి మునిసిపల్ వార్డులో ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాలి.
. బహిరంగంగా ఆహారం పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Read Also: Toll Plaza : ఆర్మీ జవాన్‌పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్‌గేట్‌ సిబ్బంది..