Site icon HashtagU Telugu

Rajya Sabha : రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం

Vice-President Jagdeep Dhankhar administers oath to newly elected Rajya Sabha members

Vice-President Jagdeep Dhankhar administers oath to newly elected Rajya Sabha members

Rajya Sabha: రాజ్యసభ (Rajya Sabha)కు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు (taken oath). బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ (Jagdeep Dhankhar) కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్ (L Murugan)‌, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా (Manoj Jha) సహా మొత్తం 12 మంది సభ్యులు (Rajya Sabha Members) పెద్దల సభకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..

.ఎల్. మురుగన్
.ధర్మశీల గుప్తా
.మనోజ్ కుమార్ ఝా
.సంజయ్ యాదవ్
.గోవింద్‌భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా
.సుభాష్ చందర్
.హర్ష్ మహాజన్
.జీసీ చంద్రశేఖర్
.అశోక్ సింగ్ చంద్రకాంత్
.హండోరే మేధా
.విశ్రమ్ కులకర్ణి
.సాధన సింగ్

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా 54 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. వీరిలో 9 మంది కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. మంగళవారం ఒక్క రోజే 49 మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయగా.. ఐదుగురు ఎంపీలు బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న ఏడుగురి రాజ్యసభ పదవీ కాలం కూడా మంగళవారంతో ముగిసింది. వీరిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీమ, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ఉన్నారు. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పదవీ కాలం బుధవారంతో ముగియనున్నది. ఈ కేంద్ర మంత్రులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read Also: Rupay Card New Features : ‘రూపే’ కార్డులో మూడు కొత్త ఫీచర్లు.. ఇవిగో