Congress MP Vasantrao Chavan Passes Away: కాంగ్రెస్ సీనియర్ నేత వసంతరావు చవాన్ (70) కన్నుమూశారు. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది. తొలుత నాందేడ్‌లోని ఆస్పత్రిలో చేరగా డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత ప్రతాప్ పాటిల్ చిఖ్లికర్‌ను ఓడించి రాజకీయ వర్గాల్లో ఓ శక్తిగా ఎదిగారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ఈ దుఃఖంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం చవాన్ కుటుంబం వెంట ఉందని తెలిపారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వసంతరావు చవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా “మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ వసంతరావు చవాన్ మృతికి నా హృదయపూర్వక సంతాపం. గ్రామపంచాయతీ సభ్యునిగా అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాలు ప్రారంభించి పలు పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేసిన సీనియర్ నాయకుడు.. చివరి శ్వాస వరకు తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు.
1978లో నైగావ్ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చవాన్, మహారాష్ట్ర శాసనసభ ఉభయ సభలకు ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా, చవాన్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కమిటీలలో వివిధ పదవులను నిర్వహించారు. నాందేడ్‌లోని జనతా హైస్కూల్ ఛైర్మన్‌గా సేవలందిస్తూ విద్యారంగంలో కూడా చురుకుగా ఉన్నారు.
Also Read: BJP First List: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల