Narendra Modi : యావత్ ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయులు సత్యసాయి బాబా

ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi) మాట్లాడుతూ కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు.

Narendra Modi : పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi) మాట్లాడుతూ కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జీవితంలో ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు ‘‘సత్యసాయి బాబా ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ప్రేమ అనే రెండు అక్షరాల్లోనే అనంతమైన శక్తి ఇమిడి ఉంది. ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి.

ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ ఆయన ప్రేమ సందేశమిచ్చారు. సత్యసాయి తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన తీరు అందరికి ఆదర్శనీయం. సేవాభావమే జీవన విధానంగా మార్చుకున్నారు సత్యసాయి బాబా . మానవ సేవే మాధవ సేవని గుర్తించి జీవించాలి. కరుణ, ప్రేమరసంతో ఎంతోమందిని ఆయన అక్కున చేర్చుకున్నారు. సత్యసాయిబాబా ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. భారత్‌.. ఆధునిక డిజిటల్‌ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు డిజిటల్ రూపంలోకి మారాలి’’ అని మోదీ కోరుకున్నారు.

Also Read:  Bride Escape with Money : పెళ్లైన రెండు నెలలు.. మొత్తం డబ్బుతో ఉడాయించిన యువతి.