Site icon HashtagU Telugu

Varanasi International Cricket Stadium : శివతత్వం ఉట్టిపడేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నమూనా చిత్రాలు చూశారా..!

Varanasi International Cric

Varanasi International Cric

Varanasi International Cricket Stadium దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటిలోకి వస్తుంది. కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి పుణ్యక్షేత్రంలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని మోడీ ఈ స్టేడియానికి సంబంధించిన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బినీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, సునీల్ గవస్కర్, రవిశాస్త్రి హాజరుకానున్నారు. ప్రధాని మోడీ వారణాసి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

ఈ Varanasi International Cricket Stadium స్టేడియం శివతత్వం ఉట్టిపడేలా  డిజైన్ చేశారు. పెవిలియన్ స్టాండ్ ని శివుని చేతిలో ఉన్న ఢమరుకం రూపంలో నిర్మించనున్నారు. ప్రేక్షకుల గ్యాలరీగా గంగా ఘాట్ మెట్ల రూపం, త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్లు ఇక స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకుని పోలిన ఒక మెటాలిక్ సీట్.. ఇక పైన కప్పు అర్ధ చంద్ర ఆకారం తో ఏర్పాటు చేయనున్నారు.

30 వేల సీటింగ్ సామర్ధ్యంతో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తర ప్రదేష్ ప్రభుత్వం 121 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. స్టేడియం నిర్మాణానికి 330 కోట్ల దాకా కర్చు అవుతుందని తెలుస్తుంది. ఇది పూర్తైతే కాన్పూర్ , లఖ్ నవాల్ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 3వ అంతర్జాతీయ స్టేడియంగా అవుతుంది. ఈ స్టేడియాన్ని వారణాసిలోని రాజతలాబ్ రింగ్ రోడ్ కి దగ్గరలో నిర్మించనున్నారు. 2025 కల్లా ఇది పూర్తి అవుతుందని అంటున్నారు.

Also Read : Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!