Vande Metro Soon : త్వరలో వందే మెట్రో ట్రైన్స్.. ఎప్పుడంటే ?

ఇప్పటివరకు మనం వందే భారత్ రైళ్లను చూశాం.. త్వరలో వందే మెట్రో రైళ్లను(Vande Metro Soon) కూడా చూడనున్నాం..

  • Written By:
  • Updated On - May 27, 2023 / 04:44 PM IST

ఇప్పటివరకు మనం వందే భారత్ రైళ్లను చూశాం.. త్వరలో వందే మెట్రో రైళ్లను(Vande Metro Soon) కూడా చూడనున్నాం.. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం 500-800 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య నడుస్తున్నాయి. అయితే వందే  మెట్రోలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య నడుస్తాయి. ఈ రైళ్లను తొలి విడతలో  లక్నో-కాన్పూర్, ఢిల్లీ-మీరట్, ముంబై-లోనావాలా, కోల్‌కతా- హల్దియా, చెన్నై- తిరుపతి రూట్లలో నడిపే ఛాన్స్ ఉంది.  ఈ రైళ్లు ఇంకా డిజైన్ స్టేజ్ లోనే ఉన్నాయని సమాచారం. ఈ రైళ్లను ప్రారంభించే ముందు పరీక్షించాల్సిన అవసరం ఉంది.

Also read : Water Metro: తొలి వాటర్‌ మెట్రో ప్రారంభించిన మోదీ.. ప్రత్యేకతలివే..!

వందే  మెట్రో ట్రైన్స్ కు డిజైన్,  టెస్టింగ్‌ను ఖరారు చేయడానికి మరో ఆరు నెలలు టైం పట్టొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా వీటిని మనం పట్టాలపై చూస్తాం. పూర్తిగా ఎయిర్ కండిషన్  కలిగిన వందే మెట్రో రైళ్లలో (Vande Metro Soon) 8 కోచ్‌  లు ఉంటాయని అంటున్నారు. త్వరలోనే ముంబై లోకల్ రైళ్లు చరిత్రగా మారిపోబోతున్నాయి. రైల్వే బోర్డు సబర్బన్ రైల్వే నెట్ వర్క్ ను అప్‌గ్రేడ్ చేసేందుకుగానూ  238 వందే మెట్రో రైళ్లను తయారు చేయనుందని ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ముంబై లోకల్ ట్రైన్స్ స్థానంలో త్వరలోనే వందే మెట్రో రైళ్లు రాబోతున్నాయన్న మాట.