Site icon HashtagU Telugu

Vande Bharat Sleeper : వందే భారత్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

Vande Bharat Sleeper trial run successful

Vande Bharat Sleeper trial run successful

Vande Bharat Sleeper : అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వందే భారత్‌ స్లీపర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ను మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది. మరుసటి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.

ఈ సందర్భంగా అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. ఎస్‌ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్‌ రన్‌లో రైల్వే టెక్నికల్‌ టీమ్‌తోపాటు, ఐసీఎప్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక.. వందేభారత్‌ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. కాగా ఈ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్‌ రైల్వే భావిస్తున్నది. దీనికోసం పది రైళ్లను సిద్ధం చేస్తున్నది. వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్‌ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ సైతం ఉంటుంది.

ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్‌ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. రైలులో ఫైర్‌ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద అత్యవసర స్టాప్‌ బటన్స్‌ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్‌ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు.

Read Also: Hot Chocolate Drink : వింటర్ హాట్ చాక్లెట్ డ్రింక్ వంటకాలు ఇంట్లో ఆనందించండి