Site icon HashtagU Telugu

Vande Bharat Express: ఆవును ఢీకొట్టిన వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​

Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు గురించి మనందరికీ తెలుసు. మరో చిన్న ప్రమాదానికి కారణమైంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ అయితే గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ రైలు అతివేగంగా ప్రయాణిస్తున్న సమయంలో పట్టాలపై ఉన్న నాలుగు గేదెలను ఢీకొట్టింది. నాలుగు గేదెలు చనిపోగా.. రైలు ముందు భాగంలోని ఫైబర్ భాగం విచిన్నమైనది.

ఇది జరిగిన మరునాడే శుక్రవారం గుజరాత్ లోని ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి వచ్చిన ఓ ఆవును వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈసారి రైలు ముందు భాగంలో బలమైన సొట్ట ఏర్పడింది. ఈ ప్రమాదంతో రైలును పది నిమిషాల పాటు ఆపగా.. తర్వాత మామూలుగా ప్రయాణించింది.

గాంధీ నగర్ – ముంబై మధ్య:

గుజరాత్ లోని గాంధీ నగర్, మహారాష్ట్రలోని ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంలో భాగంగా ఇక్కడ కూడా ప్రవేశపెట్టింది. గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పై ప్రమాదాలపై స్పందిస్తూ… ‘‘పట్టాలపైకి వచ్చే జంతువులను గమనించడం, వాటిని రైలు ఢీకొట్టకుండా చూడటం సాధ్యంకాదు. పశువులను పెంచుకునేవారు వాటిని రైలు పట్టాలవైపు వెళ్లకుండా చూసుకోవాలి. రైలు ముందు భాగంలోని ఫైబర్ బంపర్ సాధారణమైనదే. దానివల్ల రైలు పనితీరుపై ఎలాంటి ప్రభావం పడదు. వెంటనే తొలగించి మరొకటి ఏర్పాటు చేసుకోవచ్చు..” అని పేర్కొన్నారు.