Site icon HashtagU Telugu

Amit Shah: భారత బలాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వాజ్ పేయి: అమిత్ షా

Amit Shah

Amit Shah

PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ప్రముఖులు కూడా వాజ్‌పేయి సేవలను కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వాజ్‌పేయి దేశానికి చేసిన నిస్వార్థ సేవను గుర్తిస్తూ వాజ్‌పేయికి నివాళులర్పించారు. అణు పరీక్షలు మరియు కార్గిల్ యుద్ధం ద్వారా భారతదేశ బలాన్ని ప్రదర్శించడంలో వాజ్‌పేయి పాత్రను ప్రశంసించారు. అలాగే సుపరిపాలన అమలు చేయడంతో ప్రశంసించారు.

BJP చీఫ్ JP నడ్డా వాజ్‌పేయిని “భారత రాజకీయాలలో మార్గదర్శకుడు” అని అభివర్ణించారు. దేశ ఉద్ధరణ మరియు ప్రజా సేవ కోసం వాజ్‌పేయి జీవితకాల అంకితభావాన్ని నడ్డా నొక్కిచెప్పారు. కాగా అంతకుముందు మోడీ మాట్లాడారు. దేశ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు వాజ్‌పేయి జీవితకాల నిబద్ధతను ఎత్తిచూపారు. భారతమాతకు ఆయన చేసిన అంకితభావం సేవకు కృతజ్ఞతలు తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజ్‌పేయి 1999 నుండి 2004 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 25, 1924న జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆగస్టు 16, 2018న కన్నుమూశారు.