Site icon HashtagU Telugu

14 Days – 41 Workers : రెండు వారాలుగా బండ వెనుకే 41 బతుకులు.. ఏం జరుగుతోంది ?

14 Days 41 Workers

14 Days 41 Workers

14 Days – 41 Workers : ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత 14 రోజులుగా 41 మంది కార్మికులు ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయారు. రెండు వారాలుగా వారంతా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సొరంగంలో గడుపుతున్నారు. పైపుల ద్వారా రెస్క్యూ టీమ్ వాళ్లు పంపుతున్న నీరు, ఆహారం తింటూ బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కేసుకుంటున్నారు.  13వ రోజు (శుక్రవారం) రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని, కార్మికులంతా బయటికి వస్తారనే వార్తలు వచ్చినప్పటికీ అలా జరగలేదు.

We’re now on WhatsApp. Click to Join.

కనీసం ఇవాళైనా (శనివారం) కార్మికులు బయటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కార్మికులు చిక్కుకున్న సొరంగం భాగాన్ని డ్రిల్లింగ్ చేసేందుకు వాడుతున్న అత్యాధునిక అమెరికా డ్రిల్లింగ్ మెషీన్ ‘ఆగర్’ పదేపదే మొరాయిస్తోంది. దీంతో రెస్క్యూ వర్క్ పదేపదే ఆగిపోతోంది. శుక్రవారం రోజంతా ఇదే జరిగింది. సొరంగాన్ని డ్రిల్లింగ్ చేసే ప్రదేశంలో ఏదో మెటల్ పదార్థం అడ్డురావడంతో ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్ చేయలేకపోయింది. ఫలితంగా చాలా టైం వేస్ట్ అయింది.

Also Read: Door Delivery of Diesel: మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ బండిలో డీజిల్ అయిపోయిందా..? అయితే మీరు ఉన్న చోటకే ఆయిల్ వస్తుంది ఇలా..!

అంతేకాదు.. డ్రిల్లింగ్ వర్క్స్ చేస్తుండగా కార్మికులు చిక్కుకున్న భాగంలోని సొరంగం పైకప్పు ఏరియాలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఒకవేళ ఆ పగుళ్లు మరింత పెరిగి కూలితే.. 41 మంది కార్మికుల ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. అందుకే స్లోగా వర్క్స్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం 58 మీటర్ల విస్తీర్ణం కలిగిన భారీ గోడలాంటి నిర్మాణాన్ని డ్రిల్ చేస్తే 41 మంది కార్మికులను బయటికి తీయొచ్చు. ఇప్పటివరకు ఈ 58 మీటర్ల భాగానికిగానూ 47 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయింది. మరో 11 మీటర్ల దూరం డ్రిల్ చేస్తే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుంది. ఇదంతా జరగడానికి ఇవాళ రాత్రి లేదా రేపు (ఆదివారం) ఉదయం వరకు వర్క్స్‌ను కొనసాగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు(14 Days – 41 Workers) చెబుతున్నాయి.