Uniform Civil Code : UCC ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
Latha Suma
Uttarakhand was the first state to implement UCC
Uniform Civil Code : ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి యూసీసీకి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఇక దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఇక, 2024 ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరిలో పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.
యూసీసీలో ఉన్న నిబంధనలేంటి తెలుసుకుందా..?
. ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది.
. వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
. వివాహ నమోదు తప్పనిసరి.
. భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది.
. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకోవచ్చు.
. హలాల్ విధానంపై కూడా నిషేధం విధించారు.
. సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
. సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్)లో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులువుగా రూపొందించవచ్చు.