Uttarakhand Civil Code : అసెంబ్లీలో యూసీసీ బిల్లుపై చర్చ.. ‘లివిన్’పై సంచలన ప్రతిపాదనలు

Uttarakhand Civil Code : యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు.

  • Written By:
  • Updated On - February 6, 2024 / 02:33 PM IST

Uttarakhand Civil Code : యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ బిల్లును సభలో ప్రజెంట్ చేశారు. ఈసందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్‌లు, డెస్క్‌లను కొడుతూ.. ‘జై శ్రీ రామ్’, ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. బిల్లుపై ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంతకుముందు రాజ్యాంగపు గ్రంథాన్ని చేతపట్టి సీఎం ధామి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఈ బిల్లులోని నిబంధనలను అధ్యయనం చేయడానికి సమయం ఇవ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసనలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును(Uttarakhand Civil Code) ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్ష నేత యశ్‌పాల్‌ ఆర్య పేర్కొన్నారు. దీంతో జోక్యం చేసుకున్న అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి.. బిల్లును అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇస్తామని విపక్ష సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో విపక్ష సభ్యులు శాంతించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే క్రమంలోనే యూసీసీ బిల్లును ఆమోదించబోతున్నామని సీఎం ధామి అంటున్నారు. ఉత్తరాఖండ్ బాటలోనే నడిచేందుకు గుజరాత్, అసోం, హర్యానా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి.

Also Read : iPhone 16: ఐఫోన్ 16 కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఆ స‌మ‌స్య‌కు చెక్‌..!

యూనిఫాం సివిల్ కోడ్ కీలక ప్రతిపాదనలు

  • యూనిఫాం సివిల్ కోడ్ చట్టంగా మారిన తర్వాత  లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌‌కు సంబంధించిన కొత్త నిబంధనలు ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వస్తాయి. ఇప్పటికే లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు లేదా కొత్తగా ఆ తరహా సంబంధం మొదలుపెట్టాలని భావించేవాళ్లు  తప్పకుండా తమ వివరాలను జిల్లా రిజిస్ట్రార్ వద్ద నమోదు చేయించుకోవాలి.
  • లివిన్ రిలేషన్‌షిప్ చేయాలనుకునే జంటలో ఎవరి వయసైనా 21ఏళ్ల కంటే తక్కువుంటే.. వారికి తల్లిదండ్రుల సమ్మతి అవసరం. రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. 
  • లివిన్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారిలో ఎవరైనా ఒకరికి మ్యారేజ్ అప్పటికే జరిగి ఉన్నా.. అలాంటి వారి వివరాలను రిజిస్టర్ చేయరు.
  • లివిన్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారిలో ఎవరైనా ఒకరు మైనర్ అయినా.. అలాంటి వారి వివరాలను రిజిస్టర్ చేయరు.
  • లివిన్ రిలేషన్ షిప్ వివరాలను నమోదు చేయడానికి ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తారు. ఇది జిల్లా రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో నడుస్తుంది.
  • ఒకవేళ ఎవరిదైనా లివిన్ రిలేషన్ షిప్‌ను రిజిస్టర్ చేసేందుకు రిజిస్ట్రార్ నిరాకరిస్తే..  అదుకు గల కారణాలను రిజిస్ట్రార్  లిఖితపూర్వకంగా తెలియజేస్తారు.
  • లివిన్ రిలేషన్ షిప్‌ల డిక్లరేషన్‌లను సమర్పించడంలో విఫలమైతే లేదా తప్పుడు సమాచారం అందిస్తే మూడు నెలల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు.
  • లివిన్ రిలేషన్ షిప్ నమోదు చేయకపోతే.. గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు.
  • రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంలో ఒక నెల ఆలస్యమైనా, మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు.