Site icon HashtagU Telugu

Uttarakhand : యువతి హత్యకేసులో…బీజేపీ నేత కుమారుడు అరెస్ట్…!!

Ankita Bhundari

Ankita Bhundari

ఓ యువతి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉత్తరాఖండ్ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు. రిషికేష్ లక్ష్మణ్ ఝలా ప్రాంతంలో ఓ రిసార్టులో పనిచేస్తున్న రిసెప్షనిస్టు 19ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఈనెల 18 న యువతి అదృశ్యమైంది. అదేరోజు పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరబ్, పుల్కిత్ గుప్తాలో కలిసి రిషికేష్ వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగుంటే రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని ఆమె బెదిరించింది. కోపంతో రగిలిపోయిన నిందితులు ఆమెను కెనాల్‌లోకి తోసేశారు.

 

అయితే మిస్సింగ్ కేసును పోలీసులు శుక్రవారం హత్య కేసుగా మార్చారు. ప్రధాన నిందితుడైన పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరభ్ భాస్కర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెను నిందితులు వేధించారని, బాధితురాలి తండ్రి ఆరోపించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల తర్వాత 21న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా సీఎం పుష్కర్ సింగ్ ధామి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు నిందితులైన పుల్కిత్ ఆర్య రిసార్ట్ పై అధికార యంత్రాంగం బుల్ డోజర్లతో కూల్చివేశారు. నిందితులపై ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.