Site icon HashtagU Telugu

Woman Gang Raped: యూపీలో దారుణం.. ఇంటికి వెళ్తున్న యువతిపై గ్యాంప్ రేప్

Gang Raped

Gang Raped

యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై 23 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Raped) పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గంటలోపే జైవీర్, టిటు, చాచా అనే టాక్సీ డ్రైవర్‌తో సహా ముగ్గురు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న షేర్ టాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితులు బాలికను ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌ వేపై పడవేసి అక్కడి నుండి పారిపోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న గంటలోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆగ్రా పోలీస్ కమిషనర్ ప్రీతీందర్ సింగ్ తెలిపారు. గ్యాంగ్‌రేప్ ఘటనపై ఓ యువతి ఫిర్యాదుతో వచ్చిందని ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నివేదిక రాసిన తర్వాత బుధవారం ఉదయం కేసు దర్యాప్తు ప్రారంభించి గంటలోపు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నోయిడాలోని సెక్టార్ 37 నుంచి షేర్ ట్యాక్సీ ఎక్కిన యువతి, నోయిడా నుంచి ఫిరోజాబాద్ వైపు టాక్సీ వెళ్తోంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాక్సీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసి, ఎత్మాద్‌పూర్‌లో దించి పారిపోయారని మహిళ పేర్కొంది. అక్కడి నుంచి ఆటోరిక్షా తీసుకుని ఫిరోజాబాద్ వెళ్లింది.

Also Read: Vallabhaneni Janardhan: మరో టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ.. బుధవారం ఉదయం మహిళ ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఈ సంఘటనపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించాం. ఈ సంఘటనలో టాక్సీగా ఉపయోగించిన మారుతీ కారుని ట్రాక్ చేయడానికి టోల్ ప్లాజా ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసి వాహనాన్ని సీజ్ చేశాం.ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Exit mobile version