CM Yogi : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించాడు. ముఖ్యమంత్రి యోగి తలను నరుకుతానంటూ హెచ్చరిక చేశాడు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను జరగనిచ్చేది లేదన్నాడు. అంతటితో ఆగకుండా హిందూ దేవుళ్లు, దేవతలపై.. అయోధ్యలో రామమందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మైజాన్ రజా అనే ఫేస్‌బుక్ ఐడీ నుంచి యువకుడు ఈ వివాదాస్పద పోస్టులు పెట్టాడు. వీటిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read :Samantha : చికెన్ గున్యా, కీళ్ల నొప్పులపై సమంత పోస్ట్ వైరల్
బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమానికి చెందిన పండితుడు కేకే శంఖధార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అభ్యంతరకర ఫేస్‌బుక్ పోస్ట్ గురించి పోలీసులకు(CM Yogi) ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాని ఆధారంగా విచారణ మొదలుపెట్టిన బరేలీలోని ప్రేమ్ నగర్ ఏరియా పోలీసులు.. ఆ పోస్టు పెట్టిన యువకుడి ఆచూకీని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు ? మహాకుంభ మేళాను ఆపాలని ఎందుకు భావిస్తున్నాడు ? అనే కోణంలో సదరు యువకుడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.
Also Read :Kerala Shocker : అథ్లెట్‌పై అమానుషం.. ఐదేళ్లలో 60 మంది లైంగిక వేధింపులు
ఇవాళ అయోధ్యలో రామమందిరం తొలి వార్షికోత్సవాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రజలకు ఆయన రామాలయ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ”రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు” అని ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాన్ని యోగి గుర్తు చేశారు. 2014కు ముందు అయోధ్యలో కరెంటు కూడా లేదన్నారు. ఇప్పుడు ఇక్కడ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సరయూ నదీ ఘాట్‌లు యావద్దేశంలోని టూరిస్టులను ఆకర్షిస్తున్నాయని యోగి తెలిపారు. ‘‘సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలి’’ అని ఆయన ప్రజలను కోరారు.