Site icon HashtagU Telugu

PM Modi: అమెరికా సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి ఆ సత్తా ఉంది..!

Resizeimagesize (1280 X 720) (3) 11zon

Resizeimagesize (1280 X 720) (3) 11zon

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా (America) నుంచి పెద్ద ప్రకటన వెలువడింది. ఈ యుద్ధాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరని అమెరికా పేర్కొంది. మోదీ ఇప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించగలడని, ప్రధాని మోదీ కృషిని అమెరికా కూడా ప్రశంసించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ రెండు రోజుల రష్యా పర్యటన నుండి తిరిగి వచ్చిన సమయంలో US నుండి ఈ ప్రకటన వచ్చింది. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా దోవల్ సుదీర్ఘ సంభాషణలు జరిపారు.

అమెరికా ఏం చెప్పింది..?

నిజానికి శుక్రవారం వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై జాన్ కిర్బీ స్పందిస్తూ.. ‘యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇంకా సమయం ఉందని నేను భావిస్తున్నాను. యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలకు మేం మద్దతిస్తామని తెలిపాడు. కిర్బీ అక్కడితో ఆగలేదు. అతను ఇంకా మాట్లాడుతూ.. ‘యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడికి ఇంకా సమయం ఉందని నాకు అనిపిస్తోంది. అలా చేయడానికి ప్రధాని మోడీ మాత్రమే అతన్ని ఒప్పించగలరు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలనుకుంటే అందుకు అనుమతిస్తాం. ప్రధాని మోదీ ప్రయత్నాలను అమెరికా స్వాగతిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఒప్పించగలరని, అలా చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య శత్రుత్వం అంతం అవుతుందని జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు.

Also Read: Flight Violence: విమానాల్లో హింస.. 2022లో ‘నో ఫ్లై లిస్ట్’ లో 63 మంది.. ఇండిగోలో గరిష్ఠంగా..!

ఈ మానవతా సంక్షోభాన్ని అరికట్టేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాపై అనేక ఆంక్షలు విధించి మానవాళిని కాపాడతాయని అన్నారు. పౌరుల భద్రత కోసం రష్యాను ఆపడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ సమయంలో ఉక్రెయిన్‌లో సామాన్యులకు ఎలాంటి చెడు జరిగినా దానికి ఒక్కరే బాధ్యత వహిస్తారని అది పుతిన్ అని కిర్బీ అన్నారు. వారు ఇప్పటికీ యుద్ధాన్ని ఆపగలరని కిర్బీ పేర్కొన్నాడు. అయితే యుద్ధాన్ని ఆపడానికి బదులుగా రష్యా శక్తి, మౌలిక సదుపాయాలపై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తోంది. 2022 సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంభాషణ సందర్భంగా ఇది యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ అన్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడుతూ.. ‘నేడు యుద్ధ యుగం కాదు’ అని అన్నారు.

Exit mobile version