Shashi Tharoor: వాషింగ్టన్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఇటీవల అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని కీలక ఉత్పత్తులపై 50% వరకు దిగుమతి సుంకాలు (tariffs ) విధించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అధిక టారిఫ్‌ల వల్ల భారత ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరగనున్నాయని, తద్వారా మునుపటిలా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంటుందని ఆయన అన్నారు. ఒకవేళ అమెరికన్ వినియోగదారులు అదే ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు పొందగలిగితే, భారత్ తమ మార్కెట్ షేర్ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
Anand Mahindra : ట్రంప్ సుంకాలు ..భారత్‌కు సంక్షోభమా? అవకాశమా? ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
థరూర్ అభిప్రాయపడినట్టు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం తులనాత్మకంగా తక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ఈ కారణంగా, ఆ దేశాల ఉత్పత్తులు అమెరికాలో పోటీగా నిలుస్తాయన్నది స్పష్టం. తక్కువ ధరలతో తేలికగా మార్కెట్‌ను ఆకర్షించగలుగుతారు. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్ తన ఎగుమతులను మరింత విస్తరించాలంటే విభిన్న అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో భారత్ తన ఉత్పత్తుల ఉనికి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదని, అమెరికాతో వ్యాపార సంబంధాల్లో సమతుల్యత అవసరం అని సూచించారు. భారత్ వాణిజ్య శాఖ తక్షణం ఈ విషయంపై విశ్లేషణ చేసి, పరిహార మార్గాలు సిద్ధం చేయాలని థరూర్ పిలుపునిచ్చారు.
Paralysis : పెరాలసిస్‌కు ఏజ్ లిమిట్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయం తెలుసుకోండిలా?