Indians Honoured : భారత శాస్త్రవేత్తలకు మరోసారి అమెరికాలో విశిష్ట గుర్తింపు లభించింది. ‘నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ’కి ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేశ్ ఎంపికయ్యారు. వీరికి ఈ అవార్డులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రదానం చేశారు. అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బర్కెలీ యూనివర్సిటీలో సివిల్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఎమిరెట్స్ ప్రోఫెసర్‌గా సేవలందిస్తున్నారు. సుబ్ర సురేశ్ ప్రస్తుతం బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో బయో ఇంజనీర్, మెటీరియల్ సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అశోక్ గాడ్గిల్ నేపథ్యం..
అశోక్ గాడ్గిల్ ముంబైలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫిజిక్స్ లో పట్టా పొందారు. ఐఐటీ కాన్పూర్ లో పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్ లే) నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్ డీ పట్టాలు పొందారు. శుద్ధ జలం, ఇంధన సామర్థ్యం, మెరుగైన శుభ్రత అంశాలకు సంబంధించిన పలు సాంకేతికతల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకుగానూ గాడ్గిల్‌కు ‘నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ’ని ప్రదానం(Indians Honoured) చేశారు.
సుబ్ర సురేష్ నేపథ్యం..
సుబ్ర సురేష్ ముంబైలో జన్మించారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశారు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టా పొందారు. ప్రస్తుతం సుబ్ర సురేశ్ బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో బయో ఇంజనీర్, మెటీరియల్ సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్ లో రీసెర్చ్ చేస్తున్నందుకుగానూ ఆయనకు ‘నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ’ని ప్రదానం చేశారు.