India-China: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా

భార‌త్, చైనా స‌రిహ‌ద్దులు వ‌ద్ద జ‌రిగిన ఆక్ర‌మ‌ణ గురించి మోడీ ప్ర‌భుత్వం నిజాల‌ను చెప్ప‌లేక‌పోతోంది. కొన్ని వేల కిలోమీట‌ర్లు చైనా సైన్యం వాస్త‌వాధీన రేఖ‌ను దాటుకుని వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది.

  • Written By:
  • Updated On - November 7, 2021 / 12:15 AM IST

భార‌త్, చైనా స‌రిహ‌ద్దులు వ‌ద్ద జ‌రిగిన ఆక్ర‌మ‌ణ గురించి మోడీ ప్ర‌భుత్వం నిజాల‌ను చెప్ప‌లేక‌పోతోంది. కొన్ని వేల కిలోమీట‌ర్లు చైనా సైన్యం వాస్త‌వాధీన రేఖ‌ను దాటుకుని వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ అంశంపై గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వాడీవేడి చ‌ర్చ జ‌రిగింది. ఒక్క అంగుళం భూమి కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని మోడీ చెప్పుకొచ్చాడు. ఆయ‌న చెబుతోన్న మాట‌ల‌న్నీ అబ‌ద్ధ‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిల‌దీశాడు. శాటిలైట్ పిక్చ‌ర్స్ ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశాడు. దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశం అంటూ మోడీ స‌ర్కార్ దాట‌వేసింది. కానీ, సంచ‌ల‌న వాస్త‌వాల‌ను అమెరికా ఆల‌స్యంగా బ‌య‌ట‌పెట్టింది.

Also Read :  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద భార‌త భూభాగంలోకి చైనా కొన్ని కిలో మీట‌ర్లు లోప‌ల‌కు వ‌చ్చింద‌ని తాజాగా అమెరికా ర‌క్ష‌ణ విభాగం త‌న వార్షిక నివేదిక‌లో పొందుప‌రిచింది. చైనా దేశ‌స్తులు క‌నీసం 100 ఇళ్ల‌తో కూడా ఒక గ్రామాన్ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిర్మించార‌ని తేల్చింది. ఆ మేర‌కు యూఎస్ కాంగ్రెస్ కు అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ ఒక నివేదిక‌‌ను అందించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.అమెరికా వార్షిక రిపోర్ట్ ప్ర‌కారం అరుణాచ‌‌ల్ ప్ర‌దేశ్ తూర్పు స‌రిహ‌ద్దుల్లోని వాస్త‌వాధీన రేఖ‌, టిబెట్ స్వ‌యంప్ర‌తిప‌త్తి కలిగిన ప్ర‌దేశంలో ఒక గ్రామాన్ని చైనా నిర్మించింది. గ‌త ఏడాది 100 ఇళ్ల‌ను చైనా దేశ‌స్తులు భార‌త భూభాగంలో క‌ట్టుకున్నారు. చైనా, భార‌త్ సైన్యం న‌డుమ 1962లో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన ప్రాంతంగా గుర్తించింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అప్ప‌ర్ సుబ‌న్స‌రి రాష్ట్రంలోని సార్చు న‌ది ఒడ్డున ఆ గ్రామం ప్ర‌స్తుతం ఉంది.

ఒక‌ప్పుడు ఆ ప్రాంతంలో చైనాకు చెందిన సైన్యం పోస్ట్ ఒక‌టి ఉండేది. గ‌త ఏడాది ఎల్ఏసీ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌రువాత ఆ ప్రాంతంలో చైనా ఏకంగా గ్రామాన్ని నిర్మించ‌డంతో పాటు భార‌త భూభాగంలో రోడ్ల‌ను ఇత‌ర‌త్రా మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. తూర్పు విభాగం ఆర్మీ క‌మాండ్ చీఫ్ ఇటీవ‌‌ల చైనా నిర్మించిన గ్రామంతో పాటు అక్క‌డ జ‌రుగుతోన్న వివిధ నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. ప‌లు విధాలుగా ఉప‌యోగిచుకునేందుకు అక్క‌డ రోడ్ల‌ను నిర్మిస్తున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.

భ‌విష్య‌త్ లో చైనా ఆర్మీ స్థిరంగా ఉండేలా ఆ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని కమాండ చీఫ్ అభిప్రాయ‌ప‌డ్డారు. సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌రిధిలోని ఎల్ఏసీ వెంబ‌డి గ్రామాల‌ను ఏర్పాటు చేయ‌డం వెనుక కొన్ని బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారం టిబెట్ ప్రాంతంలో చేయాల‌ని చైనా భావిస్తోంది. రైల్వే , రోడ్ల సౌక‌ర్యం క‌ల్పించ‌డం ద్వారా దాదాపు 600 గ్రామాల‌ను వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఏర్పాటు చేయాల‌ని చైనా మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.
ల‌డక్ వ‌ద్ద ప‌‌శ్చిమ హిమాల‌య ప్రాంతంలో కొన్ని వేల కిలోమీట‌ర్లు భార‌త్ వైపు చైనా సైన్యం చొచ్చుకుని వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో గ‌త ఏడాది ఇండియా, చైనా సైన్యం మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త్ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. చైనాకు చెందిన సుమారు 40 మంది మ‌ర‌ణించ‌డం లేదా గాయ‌ప‌డ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వరిలో గాల్వాన్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఎంత మంది గాయ‌ప‌డ్డారో..స్ప‌ష్టంగా ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేదు. ఎల్ ఏసీ పొడ‌వునా చైనా సైన్యం భారీగా మోహ‌రించింది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద జ‌రుగుతోన్న నిర్మాణాలు, భార‌త్ భూభాగంలోని చైనా గ్రామాల‌కు రక్ష‌ణ‌గా డ్రాగ‌న్ సైన్యం నిలుస్తోంది. సైన్యాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌డానికి చైనా అంగీక‌రించ‌డంలేదు. పైగా , ఎల్ఏసీ వ‌ద్ద భార‌త్ రెచ్చ‌గొడుతున్న కార‌ణంగా సైన్యాన్ని మోహ‌రించామ‌ని చెబుతోంది. ఇలాంటి ప‌రిణామాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ స‌ర్కార్ దాచింది. భార‌త్ , చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఏం జ‌రుగుతుందో ప్ర‌పంచానికి తెలియ‌చేస్తూ అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ నివేదిక‌ను తయారు చేయ‌డం గ‌మ‌నార్హం.