US Support Canada : భారత్‌కు కాదు కెనడాకే మా సపోర్ట్.. అమెరికా, బ్రిటన్ ప్రకటన

US Support Canada : తమ ఫస్ట్ ప్రయారిటీ ఐరోపా దేశాలకే అని అమెరికా మరోసారి నిరూపించింది.

  • Written By:
  • Updated On - October 21, 2023 / 02:50 PM IST

US Support Canada : తమ ఫస్ట్ ప్రయారిటీ ఐరోపా దేశాలకే అని అమెరికా మరోసారి నిరూపించింది. కెనడాలో మర్డర్ కు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ వ్యవహారంలో కెనడాకే తమ మద్దతు ఉంటుందని అమెరికా, బ్రిటన్ తేల్చి చెప్పాయి. భారత్ -కెనడా మధ్య గత కొన్ని నెలలుగా సాగుతున్న దౌత్య యుద్ధం తమను ఆందోళనకు గురిచేస్తోందని  అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. “దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ ఇచ్చిన అల్టిమేటం మేరకు కెనడా ప్రభుత్వం  దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకున్న విషయం మాకు తెలిసింది.  ఆవిధమైన హెచ్చరికలను చేయడం సరికాదు. దౌత్య సంబంధాలను ఈవిధంగా దెబ్బతీసుకోవడం మంచి పరిణామం కానే కాదు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడాకు సహకరించాలని భారత్ కు అమెరికా విదేశాంగ శాఖ వర్గాలు సూచన చేసినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన భారత్.. తప్పుడు అభియోగాలను మోపడం మానుకోవాలని ట్రూడోకు హితవు పలికింది. ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే కెనడాతో దౌత్య సంబంధాలను క్రమంగా తగ్గించింది. మరోవైపు కెనడా ప్రధానమంత్రి ఆరోపణలను అమెరికా, బ్రిటన్ దేశాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.   ‘‘కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంతో మేం ఏకీభవించడం లేదు. కెనడా దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా ఒప్పంద సూత్రాలకు విరుద్ధం’’ అని బ్రిటన్‌ శనివారం వ్యాఖ్యానించింది. ‘‘వియన్నా కన్వెన్షన్ కు అనుగుణంగానే  మేం నడుచుకున్నాం. కౌంటర్ బ్యాలెన్స్ చర్యలలో భాగంగానే మా దేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాం’’ అని భారత్ శుక్రవారం (US Support Canada) ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే.. భారత్ వైఖరిని ఖండిస్తూ బ్రిటన్ నుంచి అనౌన్స్ మెంట్ రావడం గమనార్హం.

Also Read: 22 Journalists Killed: యుద్ధంలో అమరులైన 22 మంది జర్నలిస్టులు