చపాతీలు తయారుచేసే పిండిలో మూత్రం కలిపి ముద్ద తయారుచేసిన ఒక పనిమనిషి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల రీనా గత 8 సంవత్సరాలుగా స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలోని ఒక వ్యాపారవేత్త ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తోంది, అయితే ఈ సమయంలో ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి నితిన్ గుప్తా భార్య రూపమ్ గుప్తాకు అనుమానం కలిగింది, ఎందుకంటే కుటుంబంలోని అందరూ కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపించారు. ఈ నేపథ్యంలో, వారి అనుమానాలను ఆర్థం చేసుకునేందుకు కిచెన్‌లో రహస్యంగా సీసీకెమెరా అమర్చారు.
ఆ తర్వాత ఫుటేజీ పరిశీలించినప్పుడు వారు ఆశ్చర్యానికి గురయ్యారు. రోటీలు తయారుచేసే పిండిలో మూత్రం కలిపిన దృశ్యాలను చూసి వారు షాకయ్యారు. వెంటనే ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట రీనా ఈ ఆరోపణలను ఖండించింది, కానీ వీడియో చూపించిన తరువాత ఆమె నేరాన్ని అంగీకరించింది. అరెస్ట్ చేసిన తరువాత ఆమెను ప్రశ్నించగా, చిన్నచిన్న విషయాలకు దూషణలు పొందడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ చర్య తీసుకున్నట్టు చెప్పింది. పోలీసుల ప్రకారం, ఇది తీవ్రంగా విచారణీయమైన విషయం.